Telugu Global
NEWS

ఏపీ రైతులకు మరో గుడ్‌ న్యూస్‌.... వెయ్యి రూపాయలు పెరిగిన రైతు భరోసా

ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్‌. రైతులకు ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరింత భరోసా ఇచ్చారు. రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంచారు. ఇంతకుముందు ప్రకటించినట్లు రూ.12,500కు బదులు రూ.13,500 రూపాయలు ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు. నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికలలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు 5 ఏళ్లపాటు రూ.13,500లు ఇవ్వాలని నిర్ణయించారు. రైతుభరోసా నాలుగేళ్లనుంచి ఐదేళ్లకు పెంచారు. నాలుగేళ్లలో రూ.50వేలకు బదులు రూ.67,500 ఇప్పుడు రైతుల అకౌంట్లకు […]

ఏపీ రైతులకు మరో గుడ్‌ న్యూస్‌.... వెయ్యి రూపాయలు పెరిగిన రైతు భరోసా
X

ఏపీ రైతులకు మరో గుడ్ న్యూస్‌. రైతులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరింత భరోసా ఇచ్చారు. రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంచారు.

ఇంతకుముందు ప్రకటించినట్లు రూ.12,500కు బదులు రూ.13,500 రూపాయలు ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు.

నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికలలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు 5 ఏళ్లపాటు రూ.13,500లు ఇవ్వాలని నిర్ణయించారు.

రైతుభరోసా నాలుగేళ్లనుంచి ఐదేళ్లకు పెంచారు. నాలుగేళ్లలో రూ.50వేలకు బదులు రూ.67,500 ఇప్పుడు రైతుల అకౌంట్లకు చేరుతుంది. ఇచ్చిన హామీ కంటే రూ.17,500 అధికంగా ప్రభుత్వం ఇస్తోంది.

వ్యవసాయ మిషన్‌లో రైతు ప్రతినిధుల డిమాండ్‌ మేరకు ఏటా ఇచ్చే సహాయాన్ని పెంచేందుకు సీఎం అంగీకరించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు కీలక సందర్భాల్లో పెట్టుబడి సహాయం చేయాలని రైతు ప్రతినిధులు కోరారు.

రైతులు, రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వివరించిన వ్యవసాయ మిషన్‌ సభ్యులు మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేయనున్నారు.

మేనెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు ఇస్తారు.

రేపు నెల్లూరులో ’’వైఎస్‌ఆర్‌ రైతుభరోసా’’ కార్యక్రయాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకు, భూములపై హక్కులున్న రైతులకు దేశ చరిత్రలోనే అత్యధికంగా సాయం అందిస్తోంది వైయస్‌ జగన్‌ ప్రభుత్వం.

First Published:  14 Oct 2019 3:55 AM GMT
Next Story