చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని వాళ్ళే చెబుతున్నారు

చంద్రబాబు ఎక్కడ కాలు పెట్టినా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా అక్కడ మటాష్‌ అయిపోతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు. చంద్రబాబు భవిష్యత్‌ అగమ్యగోచరమైందని, అల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు.

లోకేష్‌ ఓటమిని చూసి చంద్రబాబు నిత్యం కుంగిపోతున్నారన్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు ఎందుకు మారడం లేదు? అని ప్రశ్నించారు. ఇక ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్నారు సుధాకర్‌ బాబు.

ఐదేళ్ళ బాబు పాలనలో శ్రీశైలం డ్యామ్‌ ఎన్నిసార్లు నిండింది… శ్రీశైలం, సాగర్‌ డ్యామ్‌ల గేట్లు ఎన్ని ఎత్తారని ప్రశ్నించారు సుధాకర్‌ బాబు.

ప్రభుత్వం పై చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని…. ప్రజలు గుణపాఠం చెప్పినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు.

సీఎం జగన్‌ పారదర్శక పాలన చూసి బాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబుకు అల్జీమర్స్‌ వ్యాధి సోకినందు వల్లే అన్నీ అబద్ధాలే చెబుతున్నాడన్నారు. ఏ ఒక్క పథకంతోనైనా గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రజలను ఆకట్టుకున్నారా? అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు.