Telugu Global
National

ఆర్టీసీ నష్టాలకు ఓలెక్ట్రాపై నిందలా...?

ప్రకృతిని కాపాడాలని కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సూచించింది. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సులను వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది… నిధులు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ-టెండరింగ్ విధానాన్ని స్పష్టంగా కేంద్ర నిర్ణయించింది. బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు […]

ఆర్టీసీ నష్టాలకు ఓలెక్ట్రాపై నిందలా...?
X

ప్రకృతిని కాపాడాలని కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రవాణాలో ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సూచించింది.

దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోని 64 నగరాల్లో ఈ బస్సులను వినియోగించేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది… నిధులు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. వారి మార్గదర్శక సూత్రాల ప్రకారం బస్సులు నడపాలి. ఇందుకోసం ఈ-టెండరింగ్ విధానాన్ని స్పష్టంగా కేంద్ర నిర్ణయించింది.

బస్సుల అర్హత వాటి శక్తి సామర్థ్యాలు నిర్ణయించేందుకు ఉన్నతస్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జారీ చేసిన టెండర్ ఉంది. ఇందుకు సంబంధించి 110 పేజీల ఈ-టెండర్ ఆహ్వాన పత్రం లేదా 237 పేజీల ముసాయిదా రాయితీ ఒప్పందాన్ని పరిశీలిస్తే టిడిపి చేస్తున్న ఆరోపణలు ఎంత విచిత్రమైనదో విస్తుపోకతప్పదు.

బస్సుల ఎంపిక, ప్రోత్సాహాకాలు, సేకరించే బస్సుల సంఖ్య మొదలైన అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను అమలు చేయాల్సిందే.

ఇక తెలంగాణ విషయానికి వద్దాం….

తెలంగాణలోనూ పర్యావరణ హితం కోసం ఆర్టీసీ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను కొనకుండా కేవలం 40 బస్సులను అద్దె ప్రాతిపదికన మేఘా సంస్థ భాగస్వామిగా ఉన్న ‘ఓలెక్ట్రా’ బస్సులను అద్దెకు తీసుకుంది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేఘా పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది.

మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జించేస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్ల తరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ… వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీ కి మార్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా? ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, కొందరు సోషల్ మీడియాలో మేఘా వల్లే నష్టం అంటూ చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజమో ఈ లెక్కలను బట్టి తెలుసుకోవచ్చు.

అసలు ఓలెక్ట్రా సంస్థ బస్సులను లీజుకు సమకూర్చలేదు. అంతకు ముందు ఉన్న గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ సంస్థ వాటిని టీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత ఆ సంస్థలోని అత్యధిక వాటాను మేఘా ఇంజనీరింగ్ కొనుగోలు చేసింది. తదనంతరం ఓలెక్ట్రాగా పేరు మారింది. ఇది లిస్టెడ్ సంస్థ. ఇందులో చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు. పూర్తిగా మేఘా సంస్థకు సంబంధించినది కాదు.

మరో ప్రధానమైన ఆరోపణ… ఆర్టీసీకి చెందాల్సిన నిధులు ఓలెక్ట్రా (మేఘా) సంస్థకు కట్టబెట్టారని ఆరోపణ. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం కేంద్రం ఈ నిధులను టీఎస్ఆర్టీసీకి విడుదల చేసింది. టీఎస్ఆర్టీసీ ఏదో ఒక సంస్థ నుంచి వాటిని సమకూర్చుకోవాలి. అందులో భాగంగా గోల్డ్ స్టోన్ నుంచి అప్పట్లో లీజుకు సేకరించింది. ఆర్టీసీకి వచ్చిన ఆ డబ్బులు బస్సుల కొనుగోలుకు వాడక తప్పదు కాబట్టి….. సరఫరా చేసిన సంస్థకు లీజు ఒప్పందం ప్రకారం కిలోమీటర్ కు ఇంత చొప్పున చెల్లించాలి. ఇక్కడా అదే జరుగుతోంది.

బస్సులు లీజుకు ఇచ్చినందుకు టీఎస్ఆర్టీసీ లీజు ధర చెల్లించక తప్పదు. డీజిల్ బస్సులను లీజుకు తీసుకున్న ఆర్టీసీ చెల్లించాల్సిందే. అంత మాత్రాన ఆర్టీసీకి చెందాల్సిన డబ్బు ప్రైవేటుకు వెళ్లిపోయిందని ఎలా ఆరోపిస్తారు? బస్సులు లీజు ఇచ్చిన వారికి ఆర్టీసీ చెల్లించి తీరాల్సిందే. ఇందులో అక్రమం ఏమీ లేదు.

అలాగే ఎలక్ట్రిక్ బస్సుల లీజు కేంద్రం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్టీసీ పనిచేస్తోందే కానీ ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ఫ్రభుత్వం ఆదేశించినట్లు కాదు. అదే విధంగా అన్ని రాష్ట్రాలు కూడా. కేంద్రం ఆదేశాల ప్రకారమే బస్సులను లీజుకు తీసుకుంటున్నాయి. ఇది కొత్తగా తెలంగాణాలో వచ్చింది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.

అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ ఎంత మాత్రం నిజం లేదన్నది వాస్తవ పరిస్థితులు చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం.. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని ఆర్టీసీ నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్టాల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది తెలంగాణ, ఏపీలో కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.

నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది.

ఇందులో మేఘా కంపెనీ 3500 కోట్లు స్వాహా చేసిందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. ఇందులో ఓలెక్ట్రా 3500 కోట్లు స్వాహా ఎలా చేశారన్నది ఆరోపించిన వాళ్ళకే తెలియాలి. అద్దె బస్సుల వల్లనే నష్టాలూ వస్తున్నాయనే ఆరోపణ నిజం కాదు. ఇంచుమించు మూడు దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి 1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్టాలల బాట పట్టిస్తోంది.

ఇపుడు తాజా ఆరోపణ ఏంటంటే ఓలెక్ట్రా (మేఘ ఇంజనీరింగ్ కు చెందినది) కంపెనీ నుంచి కొనుగోలు చేసిన 40 ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వచేస్తున్నాయనేది. నిజానికి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే.

First Published:  14 Oct 2019 11:22 PM GMT
Next Story