Telugu Global
National

ఆంధ్రజ్యోతికి జగన్ భారీ షాక్

ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి జగన్‌ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూములను రద్దు చేసింది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు. 2017 జూన్ 28న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో… విశాఖ నడిఒడ్డున పరదేశిపాలెంలో ఆమోదా పబ్లికేషన్స్‌కు 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి విలువ 40 కోట్లు కాగా… […]

ఆంధ్రజ్యోతికి జగన్ భారీ షాక్
X

ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి జగన్‌ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూములను రద్దు చేసింది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు.

2017 జూన్ 28న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో… విశాఖ నడిఒడ్డున పరదేశిపాలెంలో ఆమోదా పబ్లికేషన్స్‌కు 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి విలువ 40 కోట్లు కాగా… కారుచౌకగా ఆమోదా పబ్లికేషన్స్‌కు నాటి ప్రభుత్వం అప్పగించింది. అర ఎకరం భూమికి కేవలం రూ.5 వేలు, మరో ఎకరం భూమికి రూ.50లక్షల చొప్పున వెల కట్టి ఆంధ్రజ్యోతి మీడియాకు అప్పగించింది.

అయితే నేడు జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ భూకేటాయింపులను జగన్‌ సర్కార్ రద్దు చేసింది. ఈ 1.5 ఎకరా భూమిని బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని నిర్ణయించారు. దాంతో ఆమోదా పబ్లికేషన్‌ 40 కోట్ల విలువైన భూమిని కోల్పోయినట్టు అయింది.

ఆమోదా పబ్లికేషన్స్‌కు ఎలాంటి అవసరాలు లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం భూమిని కేటాయించిందని… అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి పనులు కూడా చేయలేదని మంత్రి నాని వివరించారు. కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే ఆ భూమిని వాడేందుకు సిద్దమైనట్టు తెలుస్తోందన్నారు.

అసత్య ప్రచారంతో తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నందుకే ఆ మీడియా సంస్థకు చంద్రబాబు భూమి కేటాయించారని పేర్నినాని విమర్శించారు.

First Published:  16 Oct 2019 6:22 AM GMT
Next Story