బాలయ్య సినిమా శాటిలైట్ డీల్

సినిమాకు మార్కెట్ ప్రారంభమైనా కాకున్నా, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినా చేయకపోయినా.. శాటిలైట్ డీల్స్ మాత్రం లాక్ అయిపోతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో శాటిలైట్ హక్కులకు అంత డిమాండ్ ఉంది మరి. పైగా కాస్త పేరున్న హీరో సినిమా అంటే హాట్ కేక్ లా అమ్ముడుపోతాయి. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా ఆ లాంఛనం పూర్తిచేసుకుంది. షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. అంతలోనే శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ స్వయంగా ప్రకటించింది కూడా. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, 6 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు బాలయ్య. ఓ షేడ్ ను ఇప్పటికే ఫస్ట్ లుక్ రూపంలో రిలీజ్ చేశారు. మరో గెటప్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.