Telugu Global
National

జైలుకు వెళ్తే వచ్చే అధికారం నాకొద్దు " చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ కేసుల్లో అరెస్టవుతున్న నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు తన స్టాండ్‌ను పూర్తిగా మార్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ పేరెత్తేందుకు కూడా ఆయన జంకుతున్నారు. ఇటీవల యూ- టర్న్ తీసుకుని మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవంటూ పదేపదే చెబుతున్నారు. బీజేపీతో విడిపోయి తప్పు చేశానంటూ లెంపలేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం మరో అడుగు ముందుకేశారు చంద్రబాబు. ఒకవేళ చంద్రబాబును కూడా అవినీతి కేసుల్లో కేంద్రం అరెస్ట్ చేయిస్తే అప్పుడది టీడీపీకి […]

జైలుకు వెళ్తే వచ్చే అధికారం నాకొద్దు  చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ కేసుల్లో అరెస్టవుతున్న నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు తన స్టాండ్‌ను పూర్తిగా మార్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ పేరెత్తేందుకు కూడా ఆయన జంకుతున్నారు.

ఇటీవల యూ- టర్న్ తీసుకుని మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవంటూ పదేపదే చెబుతున్నారు. బీజేపీతో విడిపోయి తప్పు చేశానంటూ లెంపలేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం మరో అడుగు ముందుకేశారు చంద్రబాబు.

ఒకవేళ చంద్రబాబును కూడా అవినీతి కేసుల్లో కేంద్రం అరెస్ట్ చేయిస్తే అప్పుడది టీడీపీకి కలిసి వస్తుందని.. సానుభూతితో అధికారం కూడా వస్తుందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్న వేళ… చంద్రబాబు అందుకు భిన్నంగా స్పదించారు.

జైలుకు వెళ్లడం వల్ల వచ్చే అధికారం తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అధికారం రాకపోయినా పర్వాలేదు గానీ… జైలుకు మాత్రం వెళ్లను అని చంద్రబాబు అంగీకరించినట్టు అయింది.

First Published:  15 Oct 2019 8:00 PM GMT
Next Story