Telugu Global
NEWS

ఫుట్ బాల్ లో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరత్ర

700 గోల్స్ సాధించిన పోర్చుగల్ సాకర్ వండర్ ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, పోర్చుగీస్ వండర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన కెరియర్ లో 700వ గోల్ సాధించి తనకుతానే సాటిగా నిలిచాడు. 2019 ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీలలో భాగంగా జరిగిన యూరోపియన్ జోన్ మ్యాచ్ లో ఉక్రెయిన్ తో జరిగిన పోటీలో 34 ఏళ్ల రొనాల్డో ఈఘనతను సొంతం చేసుకొన్నాడు. పోర్చుగల్ తరపున రొనాల్డోకు ఇది 95వ గోలు కాగా…ఓవరాల్ గా […]

ఫుట్ బాల్ లో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరత్ర
X
  • 700 గోల్స్ సాధించిన పోర్చుగల్ సాకర్ వండర్

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, పోర్చుగీస్ వండర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన కెరియర్ లో 700వ గోల్ సాధించి తనకుతానే సాటిగా నిలిచాడు.

2019 ప్రపంచకప్ ఫుట్ బాల్ అర్హత పోటీలలో భాగంగా జరిగిన యూరోపియన్ జోన్ మ్యాచ్ లో ఉక్రెయిన్ తో జరిగిన పోటీలో 34 ఏళ్ల రొనాల్డో ఈఘనతను సొంతం చేసుకొన్నాడు.

పోర్చుగల్ తరపున రొనాల్డోకు ఇది 95వ గోలు కాగా…ఓవరాల్ గా 700 గోల్ కావడం విశేషం. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో …తన దేశం తరపున అత్యధిక గోల్స్ సాధించిన…ఇరాన్ ప్లేయర్ అలీ దాయ్ ( 109 గోల్స్ ) తర్వాతి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు.

తన సుదీర్ఘ కెరియర్ లో 973 మ్యాచ్ లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 700 గోల్స్ సాధించగలిగాడు. వీటిలో 457 గోల్స్ వివిధ రకాల 12 టోర్నీల ద్వారా సాధించినవే కావడం విశేషం.

తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో ప్రతి 112 నిముషాలకు రొనాల్డో ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.
తాను రికార్డుల కోసం ఫుట్ బాల్ ఆడనని…స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ వెళితే గోల్స్ వాటంతట అవే వస్తాయని రొనాల్డో ధీమాగా చెబుతున్నాడు.

First Published:  15 Oct 2019 11:35 PM GMT
Next Story