నిఖిల్ పెళ్లిపై పుకార్లు

ప్రస్తుతం ఓ హిట్ కొట్టే పనిలో బిజీగా ఉన్నాడు నిఖిల్. మరోవైపు నుంచి అతడి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఓ లేడీ డాక్టర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిపై నిఖిల్ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకముందే, అప్పుడే ఆ పుకార్లు పెళ్లి వరకు వెళ్లాయి. అవును.. ఆ లేడీ డాక్టర్ నే నిఖిల్ పెళ్లి చేసుకుంటాడంటూ కథనాలు రావడం స్టార్ట్ అయ్యాయి.

నిజానికి నిఖిల్ పెళ్లి మేటర్ బయటకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనే ఇతడి పెళ్లిపై వార్తలు వచ్చాయి. ఒక టైమ్ లో నిశ్చితార్థం వరకు వెళ్లి మరీ ఆగిపోయాడు నిఖిల్. అదంతా అతడి వ్యక్తిగతం, ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందనేది కూడా ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే ఇప్పుడు మరోసారి ఈ హీరో లవ్ లో పడ్డాడంటూ వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా చాన్నాళ్లుగా పెండింగ్ లో పడుతూ వస్తోంది. ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం తలెత్తింది. అన్నీ క్లియర్ చేసి నవంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనేది నితిన్ ఆలోచన. మరోవైపు కార్తికేయ-2 సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి కచ్చితంగా హిట్ అవ్వాలి. అప్పుడే నిఖిల్ కెరీర్ గాడిలో పడుతుంది. ఆ తర్వాతే పెళ్లి. అప్పటివరకు ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయి.