Telugu Global
NEWS

ప్రో-కబడ్డీలీగ్ లో సెమీస్ సమరం

ఢిల్లీ దబాంగ్స్ తో బెంగళూరు బుల్స్ ఢీ బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా అమీతుమీ ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ సమం ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాకౌట్ రౌండ్ లో భాగంగా…మరికొద్ది గంటల్లో జరిగే తొలిసెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ ఢిల్లీ దబాంగ్స్ తో బెంగళూరుబుల్స్, రెండో సెమీఫైనల్లో బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఢిల్లీ వైపే అందరిచూపు… గత 12 వారాలుగా …ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూవచ్చిన 12 జట్ల కబడ్డీలీగ్ […]

ప్రో-కబడ్డీలీగ్ లో సెమీస్ సమరం
X
  • ఢిల్లీ దబాంగ్స్ తో బెంగళూరు బుల్స్ ఢీ
  • బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా అమీతుమీ

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ సమం ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాకౌట్ రౌండ్ లో భాగంగా…మరికొద్ది గంటల్లో జరిగే తొలిసెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ ఢిల్లీ దబాంగ్స్ తో బెంగళూరుబుల్స్, రెండో సెమీఫైనల్లో బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఢిల్లీ వైపే అందరిచూపు…

గత 12 వారాలుగా …ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూవచ్చిన 12 జట్ల కబడ్డీలీగ్ కాస్త…నాలుగుజట్ల సెమీస్ దశకు చేరింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ నాకౌట్ రౌండ్లో నాలుగు అత్యుత్తమజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

లీగ్ దశలో మొత్తం 85 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచిన ఢిల్లీ దబాంగ్స్…తొలిసెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ తురుపుముక్క, స్టార్ రైడర్ 19 ఏళ్ల నవీన్ కుమార్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు.

మొత్తం 20 సూపర్ -10 పాయింట్లతో సహా మొత్తం 270 పాయింట్లతో దూకుడుమీదున్న నవీన్ పైనే ఢిల్లీ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

మరోవైపు బెంగళూరుబుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ 335 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా…ప్రదీప్ నర్వాల్ 304 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఎలిమినేటర్ విజేతలు….

ఎలిమినేటర్ -1 పోటీలో యూపీ యోధా జట్టును 48-45 పాయింట్ల తేడాతో అధిగమించడం ద్వారా…బెంగళూరు బుల్స్ సెమీస్ బెర్త్ సాధించడం ద్వారా.. అత్మవిశ్వాసంతో పోటీకి దిగుతోంది.

ఎలిమనేటర్ -2 పోటీలో యూ-ముంబా 46-38 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ ను ఓడించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

మొత్తం మీద…నాలుగు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే సెమీస్ సమరం హోరాహోరీగా ముగియటం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు.

First Published:  15 Oct 2019 7:59 PM GMT
Next Story