రొమాంటిక్ గా రమ్యకృష్ణ

టైటిల్ చూసి ఏదేదో ఊహించుకోవద్దు. రొమాంటిక్ అనే సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తోందంతే. ఆ విషయాన్ని మేకర్స్ ఇలా రొమాంటిక్ గా చెప్పారు. పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలోకి రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆమె పోర్షన్ షూటింగ్ ను నిన్నట్నుంచి స్టార్ట్ చేశారు. అదేంటో మొన్ననే రొమాంటిక్ షూటింగ్ సెట్ ఒకటి కాలిపోయింది. ఆ న్యూస్ ఇలా వైరల్ అయిందో లేదో ఈ న్యూస్ బయటకు వదిలారు. కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేది.

సినిమాలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తుందని మాత్రమే క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఆమె పాత్ర ఏంటనే విషయాన్ని బయటపెట్టలేదు. కొంతమంది హీరో తల్లి అంటున్నారు, మరికొంతమంది హీరోయిన్ తల్లి అంటున్నారు. మొత్తమ్మీద రమ్యకృష్ణది మాత్రం కీలక పాత్ర అని తేల్చారు.

బాహుబలిలో శివగామిగా నటించిన తర్వాత రమ్యకృష్ణ దశ తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టే రమ్యకృష్ణ కూడా తన వద్దకు వస్తున్న పాత్రల్ని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. రొమాంటిక్ లో పాత్రను కూడా ఆమె ఇలానే సెలక్ట్ చేసుకుందని అంటోంది యూనిట్.

ఈ సినిమాతో అనీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతడిది కేవలం డైరక్షన్ మాత్రమే. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ పూరి జగన్నాధ్ చూసుకుంటున్నాడు. నిర్మాణ బాధ్యతలు దీనికి అదనం. ఈ సినిమతో ఎలాగైనా కొడుకును హీరోగా నిలబెట్టాలనేది పూరి తాపత్రయం.