Telugu Global
Cinema & Entertainment

పుట్టినరోజు వేళ.. సరికొత్త ఆలోచన

తన పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఏదో ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో, ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఇకపై తన ప్రతి పుట్టినరోజుకు ఇలా ఏదో ఒక సమస్యను తీసుకొని, దానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు సాయితేజ్. “నాకొక ఆలోచన వచ్చింది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకు చాలా పనులు చేస్తున్నాం. అవన్నీ తాత్కాలికమైనవి. అయితే ఏదైనా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఇస్తే ఎలా ఉంటుందనే […]

పుట్టినరోజు వేళ.. సరికొత్త ఆలోచన
X

తన పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఏదో ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో, ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఇకపై తన ప్రతి పుట్టినరోజుకు ఇలా ఏదో ఒక సమస్యను తీసుకొని, దానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు సాయితేజ్.

“నాకొక ఆలోచన వచ్చింది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకు చాలా పనులు చేస్తున్నాం. అవన్నీ తాత్కాలికమైనవి. అయితే ఏదైనా ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ట్విట్టర్ లో ఓల్డేజ్ హోమ్ వాళ్లు నన్ను హెల్ప్ అడిగారు. ఆ మొత్తం నిర్మాణానికి అయ్యే ఖర్చును నేను భరిస్తున్నాను. నా పుట్టినరోజుకు ఫ్లెక్సీలు, బొకేలు వద్దు. ఆ వాటికి పెట్టే డబ్బును ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్వమని చెప్పాను. దాదాపు లక్ష రూపాయలకు పైగా వసూలు అయింది. ఆ మొత్తానికి, నా డబ్బు కూడా కలిపి నిర్మాణం పూర్తిచేస్తాను. అంతేకాదు, ఏడాది వరకు హోమ్ రన్ అవ్వడానికి ఖర్చు కూడా ఇస్తున్నాను.”

అయితే ఇదంతా తను ప్రచారం కోసం చేయడం లేదని చెప్పుకొచ్చాడు ఈ మెగా హీరో. తనను చూసి ఎవ్వరైనా స్ఫూర్తి పొందుతారనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెట్టానని అంటున్నాడు. ప్రజలంతా మంచి చేయాలని కోరుకుంటూ, తనకు సహాయసహకారాలు అందించిన మెగా ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు సాయితేజ్.

First Published:  15 Oct 2019 10:39 PM GMT
Next Story