Telugu Global
Cinema & Entertainment

వంద కోట్లు టచ్ చేసిన సైరా

ఇది గ్రాస్ కు సంబంధించిన మేటర్ కాదు, షేర్ కు సంబంధించిన విషయం. అవును.. సైరా సినిమా వంద కోట్ల రూపాయల షేర్ మార్క్ అందుకుంది. అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో కావడం విశేషం. అవును.. నిన్నటి వసూళ్లతో కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అచ్చంగా వంద కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సినిమాకు వంద కోట్లు వచ్చినా చాలా ప్రాంతాల్లో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం. ఒక్క […]

వంద కోట్లు టచ్ చేసిన సైరా
X

ఇది గ్రాస్ కు సంబంధించిన మేటర్ కాదు, షేర్ కు సంబంధించిన విషయం. అవును.. సైరా సినిమా వంద కోట్ల రూపాయల షేర్ మార్క్ అందుకుంది. అది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో కావడం విశేషం. అవును.. నిన్నటి వసూళ్లతో కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అచ్చంగా వంద కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సినిమాకు వంద కోట్లు వచ్చినా చాలా ప్రాంతాల్లో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం.

ఒక్క నైజాం, ఉత్తరాంధ్రలో మాత్రం సైరా సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. లాభాల్లోకి వెళ్లింది. మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా సాధించాల్సింది, ఆర్జించాల్సింది ఇంకా చాలా ఉంది. సినిమాకు వంద కోట్లు షేర్ వచ్చినా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదంటే.. సైరాను ఎంత భారీ రేట్లకు అమ్మారో అర్థం చేసుకోవచ్చు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో 13 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 31.30 కోట్లు
సీడెడ్ – రూ. 18.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 15.60 కోట్లు
ఈస్ట్ – రూ. 8.19 కోట్లు
వెస్ట్ – రూ. 6.38 కోట్లు
గుంటూరు – రూ. 9.39 కోట్లు
నెల్లూరు – రూ. 4.38 కోట్లు
కృష్ణా – రూ. 7.26 కోట్లు

First Published:  15 Oct 2019 7:56 PM GMT
Next Story