Telugu Global
Cinema & Entertainment

2 వారాలైనా బ్రేక్ ఈవెన్ అవ్వని సైరా

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా మెగాస్టార్ కలల ప్రాజెక్టు ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన సైరా సినిమా ఫ్లాప్ అయింది. నిన్నటితో 2 వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నైజాం, ఉత్తరాంధ్ర మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇప్పటికే 2 వారాలు కంప్లీట్ అవ్వడంతో ఈ సినిమా ఇక లాభాల బాట పట్టేది అనుమానమే. అయితే మార్కెట్లో […]

2 వారాలైనా బ్రేక్ ఈవెన్ అవ్వని సైరా
X

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా మెగాస్టార్ కలల ప్రాజెక్టు ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన సైరా సినిమా ఫ్లాప్ అయింది.

నిన్నటితో 2 వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నైజాం, ఉత్తరాంధ్ర మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.

ఇప్పటికే 2 వారాలు కంప్లీట్ అవ్వడంతో ఈ సినిమా ఇక లాభాల బాట పట్టేది అనుమానమే. అయితే మార్కెట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం సైరాకు కాస్తోకూస్తో కలిసొస్తోంది. ఈ కొద్ది రోజుల్లో ఇది బ్రేక్ -ఈవెన్ అయితే అవ్వొచ్చేమో కానీ, బయ్యర్లకు లాభాలు మాత్రం తెచ్చిపెట్టేలా కనిపించడం లేదు.

అటు నార్త్, ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే ఫ్లాప్ అయింది. ఓవర్సీస్ లో టాప్-10 లిస్ట్ లోకి చేరింది కానీ బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. అటు నార్త్ లో కూడా కేవలం 8 కోట్ల రూపాయల నెట్ తో తన రన్ ముగించింది సైరా. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ 2 వారాల్లో (14 రోజులకు గాను) సైరా షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 31.59 కోట్లు
సీడెడ్ – రూ. 18.54 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 15.81 కోట్లు
ఈస్ట్ – రూ. 8.28 కోట్లు
వెస్ట్ – రూ. 6.97 కోట్లు
గుంటూరు – రూ. 9.45 కోట్లు
నెల్లూరు – రూ. 4.42 కోట్లు
కృష్ణా – రూ. 7.29 కోట్లు

First Published:  16 Oct 2019 4:56 AM GMT
Next Story