Telugu Global
NEWS

తప్పుడు వార్తలు రాసే పత్రికలు, టీవీలపై కేసులకు నిర్ణయం

మీడియాకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా దశాబ్దాలుగా పాతుకుపోయి, ప్రత్యర్థి ప్రభుత్వాలను దెబ్బతీసేలా పనిగట్టుకుని తప్పుడు కథనాలు రాస్తున్నాయన్న భావనకు ప్రభుత్వం వచ్చింది. దీనికి చెక్ పెట్టడం ఎలా అన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చించిన ప్రభుత్వం… తప్పుడు కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా అలాంటి మీడియా సంస్థలపై 24 గంటల్లోనే కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. ప్రభుత్వ […]

తప్పుడు వార్తలు రాసే పత్రికలు, టీవీలపై కేసులకు నిర్ణయం
X

మీడియాకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా దశాబ్దాలుగా పాతుకుపోయి, ప్రత్యర్థి ప్రభుత్వాలను దెబ్బతీసేలా పనిగట్టుకుని తప్పుడు కథనాలు రాస్తున్నాయన్న భావనకు ప్రభుత్వం వచ్చింది.

దీనికి చెక్ పెట్టడం ఎలా అన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చించిన ప్రభుత్వం… తప్పుడు కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా అలాంటి మీడియా సంస్థలపై 24 గంటల్లోనే కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పని గట్టుకుని తప్పుడు కథనాలను కొన్ని పత్రికలు, టీవీలు ప్రసారం చేస్తుండడంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.

ఇటీవల గ్రామ సచివాలయం ప్రశ్నాపత్రం లీక్‌ అయిందంటూ ఊహాగానాలతోనే ఒక పత్రిక కథనాలు రాయడం, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును కావాలనే బదిలీ చేశారంటూ మరో కథనం ప్రచురించడం చేసింది.

గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి కథనాలను కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు పదేపదే ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకునే అధికారాన్ని అయా శాఖలకు చెందిన కార్యదర్శకులకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సహకరిస్తారు.

ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఏ మీడియా సంస్థ అయినా తప్పుడు కథనం ప్రచురిస్తే తొలుత ఖండన ఇవ్వాలని… అప్పటికీ సదరు మీడియా సంస్థ సరైన రీతిలో స్పందించని పక్షంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

First Published:  16 Oct 2019 9:08 PM GMT
Next Story