పేరు పెట్టలేదు కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు

ప్రస్తుతం తెలుగులో 2 సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్. వీటిలో ఒకటి మహేష్ కోనేరు నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై వస్తోంది. దీని పేరు మిస్ ఇండియా. దీంతో పాటు మరో సినిమా కూడా చేస్తోందామె. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ ఈరోజు ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేశారు.

ఈరోజు కీర్తిసురేష్ పుట్టినరోజు. అందుకే ఇలా హడావుడిగా సినిమాకు సంబంధించి కీర్తిసురేష్ లుక్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్ ను వచ్చేనెల 11 నుంచి హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. సినిమాలో కీర్తిసురేష్ తో పాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ఈ మూవీ.

వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాణంలో సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపావళికి ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మహానటి తర్వాత చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్. హీరోల సరసన ఆడిపాడే పాత్రలకు పూర్తిగా నో చెప్పేసింది. కేవలం తన క్యారెక్టర్ బాగుంటేనే ఒప్పుకుంటోంది.