Telugu Global
NEWS

ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మరో విషాదం

నాకౌట్ పంచ్ తో అమెరికన్ బాక్సర్ ప్యాట్రిక్ మృతి ప్రొఫెషనల్ బాక్సింగ్ లో దుర్మరణాలు సాధారణ విషయంగా మారిపోయాయి. బాక్సింగ్ రింగ్ లో పోరాడుతూ ప్రత్యర్థి కొట్టిన దెబ్బలకు మెదడు రక్తనాళాలు చిట్లి.. ప్రాణాలు విడిచిన బాక్సర్ల సంఖ్య రానురాను పెరిగిపోతూ వస్తోంది. గత నాలుగుమాసాల కాలంలో మూడో బాక్సర్ రింగ్ లో ప్రత్యర్థితో… ఆ తర్వాత మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. అమెరికాలోని చికాగో వేదికగా జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ మిడిల్ వెయిట్ ఫైట్ లో నాలుగురోజుల క్రితం…తలపై […]

ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మరో విషాదం
X
  • నాకౌట్ పంచ్ తో అమెరికన్ బాక్సర్ ప్యాట్రిక్ మృతి

ప్రొఫెషనల్ బాక్సింగ్ లో దుర్మరణాలు సాధారణ విషయంగా మారిపోయాయి. బాక్సింగ్ రింగ్ లో పోరాడుతూ ప్రత్యర్థి కొట్టిన దెబ్బలకు మెదడు రక్తనాళాలు చిట్లి.. ప్రాణాలు విడిచిన బాక్సర్ల సంఖ్య రానురాను పెరిగిపోతూ వస్తోంది.

గత నాలుగుమాసాల కాలంలో మూడో బాక్సర్ రింగ్ లో ప్రత్యర్థితో… ఆ తర్వాత మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.

అమెరికాలోని చికాగో వేదికగా జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ మిడిల్ వెయిట్ ఫైట్ లో నాలుగురోజుల క్రితం…తలపై తగిలిన బలమైన గాయాలకు… 27 సంవత్సరాల ప్యాట్రిక్ డే అనే బాక్సర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రోబాక్సింగ్ సంఘం ప్రకటించింది.

2013లో ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన ప్యాట్రిక్ డే.. గత ఆరేళ్ల కాలంలో పలు కీలక విజయాలు సాధించడంతో పాటు కోట్లరూపాయలు ఆర్జించాడు. మంచి భవిష్యత్ ఉన్న బాక్సర్ గా కూడా గుర్తింపు సంపాదించాడు.

అయితే… చికాగోలోని విన్ ట్రస్ట్ ఎరీనా వేదికగా.. ప్రత్యర్థి చార్లెస్ కాన్ వెల్ తో జరిగిన ఫైట్ మాత్రం…ప్యాట్రిక్ పాలిట మృత్యుపాశంగా మారింది. పదిరౌండ్లపాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థి కాన్ వెల్ విసిరిన పంచ్ లు… ప్యాట్రిక్ మెదడు పైభాగంలో బలంగా తాకాయి.

ఫైట్ ముగియకముందే తీవ్రమైన గాయాలతో ప్యాట్రిక్ కుప్పకూలిపోడంతో ..
హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

నార్త్ వెస్టర్న్ మెమోరియల్ ఆస్పత్రిలో మెదడుభాగంలో శస్త్రచికిత్స నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. నాలుగురోజులపాటు కోమాలో ఉన్న ప్యాట్రిక్.. మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు.

షాక్ లో ప్రత్యర్థి కాన్ వెల్…

తాను కొట్టిన దెబ్బలకు ప్యాట్రిక్ డే కుప్పకూలిన మరుక్షణం నుంచే విజేతగా నిలిచిన చార్లెస్ కాన్ వెల్ విజయానందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. దానికితోడు ప్యాట్రిక్ కోమాలో ఉన్న నాలుగురోజులూ కాన్ వెల్ క్షణమొక యుగంలా గడిపాడు.

తాను విజేతగా నిలవాలనుకొన్నాను కానీ…ప్రత్యర్థి ప్రాణాలు తీయాలని అనుకోవాలని..ప్యాట్రిక్ కోసం దేవుడిని పదే పదే ప్రార్థించినా, కన్నీరు కార్చినా ప్రయోజనం లేకపోయిందని…తన సందేశంలో కాన్ వెల్ వాపోయాడు.

తనకు బాక్సింగ్ అంటేనే విరక్తిపుట్టినా…ప్యాట్రిక్ జీవితలక్ష్యం నెరవేర్చడానికి తాను పోరాటం కొనసాగిస్తానని కాన్ వెల్ ప్రకటించాడు.

గత నాలుగు నెలల కాలంలో రష్యా బాక్సర్ మాక్సిమ్ దడషేవ్, అర్జెంటీనా బాక్సర్ హ్యూగో సాంటిలాన్ ప్రాణాలు కోల్పోగా… ఇప్పుడు అమెరికన్ బాక్సర్ ప్యాట్రిక్ డే… తనవంతు అన్నట్లుగా మృతి చెందాడు.

ప్రొఫెషనల్ బాక్సింగ్ లోని ఈ మరణాలను నివారించడానికి ఏదైనా చేయండంటూ అభిమానులు గోలపెడుతున్నారు.

First Published:  17 Oct 2019 8:30 PM GMT
Next Story