Telugu Global
Cinema & Entertainment

జెమినీ చేతికి నాని సినిమా

ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ విషయంలో దూసుకుపోతోంది జెమినీ టీవీ. శాటిలైట్ హక్కులు దక్కించుకునే విషయంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడడం లేదు. మరీ ముఖ్యంగా జీ తెలుగు ఛానెల్ సినిమాలు కొనడం ఆపేసిన తర్వాత జెమినీకి అది బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో నాని నటిస్తున్న V సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా దక్కించుకుంది ఆ సంస్థ. నాని, సుధీర్ బాబు హీరోలుగా వస్తున్న ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. […]

జెమినీ చేతికి నాని సినిమా
X

ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ విషయంలో దూసుకుపోతోంది జెమినీ టీవీ. శాటిలైట్ హక్కులు దక్కించుకునే విషయంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడడం లేదు. మరీ ముఖ్యంగా జీ తెలుగు ఛానెల్ సినిమాలు కొనడం ఆపేసిన తర్వాత జెమినీకి అది బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో నాని నటిస్తున్న V సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా దక్కించుకుంది ఆ సంస్థ.

నాని, సుధీర్ బాబు హీరోలుగా వస్తున్న ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. నివేత థామస్, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నానికి కెరీర్ లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. పైగా ఇందులో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇలా అన్ని రకాలుగా క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాను 8 కోట్ల రూపాయలకు జెమినీ టీవీ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయింది. అది కూడా టాకీ మాత్రమే. మరో 50శాతం టాకీతో పాటు సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. యాక్షన్ ఎడ్వెంచరస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నాడు నాని. మూవీలో చాలా చోట్ల అతడు మేకప్ లేకుండా కనిపిస్తాడట.

First Published:  18 Oct 2019 6:44 AM GMT
Next Story