Telugu Global
NEWS

రాంచీటెస్టుకు 5వేల ఉచిత టికెట్లు

19నుంచి భారత్- సౌతాఫ్రికా ఆఖరిటెస్ట్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ సిరీస్ లోని ఆఖరిటెస్టుకు ఆతిథ్యమిస్తున్న జార్ఖండ్ క్రికెట్ సంఘం.. 5వేల టికెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. సైనిక, పోలీసు దళాలకు, ఎన్ సీసీ కెడేట్లతో పాటు..రాష్ట్ర్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైతం ఫ్రీ-టికెట్లు అందచేసినట్లు నిర్వాహక సంఘం కార్యదర్శి సంజయ్ సహాయ్ ప్రకటించారు. 2007లో తొలిసారిగా భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల టెస్ట్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన […]

రాంచీటెస్టుకు 5వేల ఉచిత టికెట్లు
X
  • 19నుంచి భారత్- సౌతాఫ్రికా ఆఖరిటెస్ట్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ సిరీస్ లోని ఆఖరిటెస్టుకు ఆతిథ్యమిస్తున్న జార్ఖండ్ క్రికెట్ సంఘం.. 5వేల టికెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

సైనిక, పోలీసు దళాలకు, ఎన్ సీసీ కెడేట్లతో పాటు..రాష్ట్ర్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులకు
సైతం ఫ్రీ-టికెట్లు అందచేసినట్లు నిర్వాహక సంఘం కార్యదర్శి సంజయ్ సహాయ్ ప్రకటించారు.

2007లో తొలిసారిగా భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల టెస్ట్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 19 నుంచి భారత్- సౌతాఫ్రికాజట్ల ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.

భారత మాజీ కెప్టెన్, జార్ఖండ్ ముద్దుబిడ్డ మహేంద్రసింగ్ ధోనీ పేరుతో జార్ఖండ్ క్రికెట్ సంఘం…రాంచీ స్టేడియంలో పెవీలియన్ ను ఏర్పాటు చేసింది.

స్టేడియానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ స్టార్ హోటల్ లో సౌతాఫ్రికా క్రికెటర్లకు, 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో హోటెల్ లో భారతజట్టు సభ్యులకు విడిది ఏర్పాటు చేశారు.

మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంతో ఇప్పటికే సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్…ఆఖరిటెస్టు ను సైతం అలవోకగా గెలుచుకొనే అవకాశాలు లేకపోలేదు.

First Published:  17 Oct 2019 8:21 PM GMT
Next Story