Telugu Global
NEWS

నకిలీ ఐడీతో రవిప్రకాశ్‌ చేసిన ఘనకార్యం ఇదే...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చేసిన పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నిధుల మళ్లింపు, కృష్ణాజిల్లాలోని సంజీవిని ఆస్పత్రి, విదేశాలకు నిబంధనలకు విరుద్దంగా కోట్లాది రూపాయల నిధుల తరలింపు వంటి ఆరోపణల్లో చిక్కుకున్న రవిప్రకాశ్‌ మరో కేసులో బుక్ అయ్యారు. ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనపై సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఫేక్ ఐడీ సృష్టించి సంస్థకు సంబంధించిన కీలకమైన సమాచారం ప్రత్యర్థులకు చేరవేసిన కుట్రలో రవిప్రకాశ్‌పై ఐపీసీ 406, ఐటీ […]

నకిలీ ఐడీతో రవిప్రకాశ్‌ చేసిన ఘనకార్యం ఇదే...
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చేసిన పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నిధుల మళ్లింపు, కృష్ణాజిల్లాలోని సంజీవిని ఆస్పత్రి, విదేశాలకు నిబంధనలకు విరుద్దంగా కోట్లాది రూపాయల నిధుల తరలింపు వంటి ఆరోపణల్లో చిక్కుకున్న రవిప్రకాశ్‌ మరో కేసులో బుక్ అయ్యారు.

ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనపై సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఫేక్ ఐడీ సృష్టించి సంస్థకు సంబంధించిన కీలకమైన సమాచారం ప్రత్యర్థులకు చేరవేసిన కుట్రలో రవిప్రకాశ్‌పై ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66 డీ కింద కేసులు నమోదు చేశారు.

నటరాజన్‌ పేరుతో రహస్య సమాచారాన్ని కంపెనీ ప్రత్యర్థులకు చేరవేసిన ఆ నటరాజన్‌ ఈ రవిప్రకాశేనని పోలీసులు సాంకేతికంగా తేల్చారు. టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్‌కు ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సైఫ్ పార్టనర్స్‌కు మధ్య ఒక వివాదం ఏర్పడింది. టీవీ9ను ఏబీసీఎల్ కంపెనీకి అమ్మేందుకు సిద్దమవుతున్న తరుణంలో హైదరాబాద్‌లోని ఎల్‌సీఎల్‌టీని సైఫ్ పార్టనర్స్ సంస్థ ఆశ్రయించింది. ఈ కేసులో ఐల్యాబ్స్‌ను ఓడించాలన్న ఉద్దేశంతో నటరాజన్‌ అన్న ఫేక్‌ ఈ మెయిల్ ఐడీ ద్వారా సైఫ్‌ పార్టనర్స్‌కు అత్యంత కీలకమైన సమాచారం అంటూ కొన్ని కాపీలను పంపించారు.

ఈ సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్‌ సంస్థ ఎల్సీఎల్టీలో సమర్పించింది. ఆ కాపీలను ఎన్సీఎల్టీలో న్యాయవాది ఎన్‌.లోమేశ్‌ కొరియర్‌ ద్వారా ఐల్యాబ్స్‌ గ్రూప్‌కు పంపారు. ఆ కాపీలను చూసి ఐల్యాబ్స్ యాజమాన్యం కంగుతింది. అసలు నాటరాజన్‌ పేరుతో తమ కంపెనీలో ఉద్యోగి ఎవరూ లేరని… కమ్యూనికేషన్ కోసం నటరాజన్‌ పేరుతో ఎలాంటి ఐడీని కూడా వాడలేదని ఐల్యాబ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు సమాచారాన్ని సైఫ్‌ పార్టనర్స్‌కు పంపించి కంపెనీని దెబ్బతీయాలని చూసిన ఆ కుట్రదారుడు ఎవరో బయటకు తీయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఈ మొయిల్‌ టీవీ9 ఆఫీస్‌ నుంచి… రవిప్రకాశ్ కంప్యూటర్‌ నుంచే వెళ్లినట్టు తేల్చారు. టెక్నికల్ డేటా అనాలసిస్‌ ద్వారా ఈ ఫేక్ నటరాజన్ ఎవరో కాదు రవిప్రకాశేనని పోలీసులు తేల్చారు.

First Published:  17 Oct 2019 7:31 PM GMT
Next Story