తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్‌ అత్యాచారయత్నం

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లను, తాత్కాలిక కండక్టర్లను నియమించి బస్సులను నడుపుతోంది. ఈ ప్రయత్నం కొన్ని చోట్ల ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మంచిర్యాల డిపో పరిధిలో ఒక తాత్కాలిక డ్రైవర్‌ … తాత్కాలిక మహిళా కండెక్టర్‌పై అత్యాచారయత్నం చేశాడు.

చెన్నూరు నుంచి మంచిర్యాల వస్తున్న బస్సులో ఈ నేర ప్రయత్నం జరిగింది. మహిళా కండక్టర్‌పై కన్నేసిన డ్రైవర్ శ్రీనివాస్‌… పథకం ప్రకారం బస్సులో ప్రయాణికులను ఎక్కించుకోకుండా నిర్మానుష్యప్రాంతానికి బస్సును తీసుకెళ్లాడు.

ఎవరూ లేనిది చూసి మహిళా కండక్టర్‌పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతి కష్టం మీద శ్రీనివాస్‌ బారి నుంచి తప్పించుకున్న మహిళా కండక్టర్ జైపూర్ పోలీసులను ఆశ్రయించారు. డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.