బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలిసిపోయింది…

బిగ్ బాస్ క్లైమాక్స్ కు చేరింది.. మరో రెండు వారాల్లో ఈ షో ముగియబోతోంది. ఇంతటి క్లిష్ట సమయంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలని ప్రతి ఒక్క కంటెస్టెంట్ బలంగా కోరుకుంటున్నారు. దాని తగ్గట్లే హౌస్ లో బీభత్సంగా గేమ్ ఆడుతున్నారు.

ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులున్నారు. మరో రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. చివరివారంలో ఐదుగురు ఫైనల్లో ఉంటారు. అయితే ఈవారంలో వితిక కానీ శివజ్యోతి గానీ బాబా భాస్కర్ గానీ బయటికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎక్కువగా వితికనే ఈ వారం ఎలిమినేట్ అవ్వొచ్చని సోషల్ మీడియాలో ఓటింగ్ ట్రెండ్ ను బట్టి అర్థమవుతోంది.

ఇక టైటిల్ ఫేవర్ గా శ్రీముఖి, వరుణ్, రాహుల్ ఉన్నారు. మొదటి నుండి రాహుల్ ని టార్గెట్ చేసిన శ్రీముఖి .. మధ్యలో అతని పవర్ చూసి వెనక్కి తగ్గింది. కానీ మళ్లీ ఎలిమినేషన్ టాస్క్లో కావాలని రాహుల్ ని రెచ్చగొట్టింది.దాంతో శ్రీముఖిపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేశాయి. ఇప్పుడిదే రాహుల్ కి బాగా కలిసొచ్చే అంశం అని తెలుస్తోంది.

ఫైనల్ గా టైటిల్ పోరు వరుణ్ , రాహుల్ మధ్యనే జరగబోతుందని సమాచారం. అయితే వరుణ్ కూడా పోయిన ఎలిమినేషన్ టాస్క్ లో వితికాను సేవ్ చేసే క్రమంలో కూల్ గా ఉండకుండా శివజ్యోతిపై రంకెలేసిన విషయంలో అతడు మైనస్ అయ్యాడు.

మొదటి నుండి హౌస్ లో జరిగే గొడవలను సర్ది చెబుతూ వితికాను కంటెస్టెంట్ గా చూసే వరుణ్ చివరిలో వితికాను భార్యలా చూసి అమెను ఎలిమినేషన్ కాకుండా సేవ్ చేసి శివజ్యోతితో గొడవ పడడం అతడిపై వ్యతిరేక భావనలను క్రియేట్ చేసింది.

రాహుల్ కూడా సోలో గా శ్రీముఖి టార్గెట్ ను అడ్డకుంటూ స్ట్రాంగ్ గా నిలబడడంతో ఫైనల్ విన్నర్ గా రాహుల్ నిలుస్తాడని తెలుస్తోంది. అతనికి ప్రతి వారం పడే ఓటింగ్ చూస్తుంటే టాప్ లోనే ఉంటుండడంతో అతడే విన్నర్ అని అర్థమవుతోంది. ఈ రకంగా చూస్తే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ అని అందరు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆఖరి నిమిషాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖి కూడా విజేతగా నిలిచే అవకాశం ఉండొచ్చంటున్నారు.