Telugu Global
National

కాపీ కొట్టకుండా విద్యార్థుల తలకు అట్ట పెట్టెలు...

ఆ మధ్య బీహార్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్ట పెట్టెలు ఉంచారు. కేవలం చూడడానికి, గాలి పీల్చుకోవడానికి ముందు భాగంలో మాత్రమే హోల్స్ పెట్టి… కుడి , ఎడమ ఏమీ చూడడానికి వీల్లేకుండా అట్ట పెట్టెలను ఉంచారు. దీన్ని చూసి కర్నాటకలో మరో కాలేజీ యాజమాన్యం స్పూర్తి పొందింది. చివరకు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భాగత్ పీజీ కాలేజ్‌లో విద్యార్థుల ఇంటర్నల్ […]

కాపీ కొట్టకుండా విద్యార్థుల తలకు అట్ట పెట్టెలు...
X

ఆ మధ్య బీహార్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్ట పెట్టెలు ఉంచారు. కేవలం చూడడానికి, గాలి పీల్చుకోవడానికి ముందు భాగంలో మాత్రమే హోల్స్ పెట్టి… కుడి , ఎడమ ఏమీ చూడడానికి వీల్లేకుండా అట్ట పెట్టెలను ఉంచారు. దీన్ని చూసి కర్నాటకలో మరో కాలేజీ యాజమాన్యం స్పూర్తి పొందింది. చివరకు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భాగత్ పీజీ కాలేజ్‌లో విద్యార్థుల ఇంటర్నల్ ఎగ్జామ్స్ సందర్భంగా వారి తలలకు ఇలా అట్ట పెట్టెలు ఉంచారు. ఈ ఘటన బుధవారం జరగగా… ఆ వెంటనే సోషల్ మీడియాలో సదరు ఫోటోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కెమిస్ట్రి, ఎకనామిక్స్ పరీక్షల సందర్భంగా కాలేజీ సిబ్బంది ఈ పద్దతిని ఫాలో అయ్యారు.

ఈ ధోరణిపై దుమారం రేగడంతో కాలేజీ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల తలలకు అట్ట పెట్టెలు ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉద్దేశం ఏదైనా సరే విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అధికారులు అంటున్నారు.

ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా దీనిపై స్పందించారు. విద్యార్థులను అవమానించేలా, జంతువుల్లా చూసే అధికారం ఎవరికీ లేదన్నారు. తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే కాలేజీ హెడ్‌ సతీష్ మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటున్నారు.

బీహార్‌లో ఇదే పద్దతిని అనుసరించినప్పుడు సోషల్ మీడియాలో పెద్దెత్తున ప్రశంసలు వచ్చాయని… అందుకే తాము అదే పద్దతిని ఫాలో అయ్యామని చెబుతున్నారు. విద్యార్థులకు అట్టపెట్టెలు మాత్రమే అందించామని… వాటిని పెట్టుకుని తీరాల్సిందే అని మాత్రం తాము ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు.

First Published:  19 Oct 2019 7:57 AM GMT
Next Story