Telugu Global
National

కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై మరో అస్త్రం

బీజేపీ వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే యత్నాలకు నడుం బిగించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెలో ఇన్ వాల్వ్ అయిన తమిళిసై తాజాగా కేసీఆర్ పై మరో ఓ అస్త్రం ప్రయోగించారు. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు. ఇంచార్జీ వీసీలకు తమిళసై సౌందరరాజన్ నిధులపై ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో కాక రేపింది. ఊహించినట్లుగానే తెలంగాణ గవర్నర్ తమిళసై పంజా విసురుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై […]

కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై మరో అస్త్రం
X

బీజేపీ వేస్తున్న ఎత్తులు ఫలిస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే యత్నాలకు నడుం బిగించారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెలో ఇన్ వాల్వ్ అయిన తమిళిసై తాజాగా కేసీఆర్ పై మరో ఓ అస్త్రం ప్రయోగించారు. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు. ఇంచార్జీ వీసీలకు తమిళసై సౌందరరాజన్ నిధులపై ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో కాక రేపింది.

ఊహించినట్లుగానే తెలంగాణ గవర్నర్ తమిళసై పంజా విసురుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విషయం అటుంచితే, మరో పరిణామం కూడా కెసిఆర్ కు తలనొప్పిగానే మారింది.

ఇటీవల తమిళిసై తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల ఇన్ చార్జీ వీసీలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా పూర్తికాలం వీసీ లేడు. వాటిని భర్తీ చేయాడానికి తీసుకుంటున్న చర్యలేమిటో తెలియదు.

తాజాగా కేసీఆర్ సర్కారు చేసిన పొరపాటును తమిళిసై గుర్తించారు. రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షమ అభియాన్ (ఆర్ యూఎస్ఎ) కింద విశ్వవిద్యాలయాలకు కేసిఆర్ ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయకపోవడాన్ని ఆమె గుర్తించారు. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కోసం ఆ నిధులను కేంద్రం కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగ్రాంట్ ను విడుదల చేయించుకోవడానికి చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై ఇన్ చార్జీ వీసీలను ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని…. ఆ నిధుల నుంచి తగిన ప్రయోజనం పోందాలని ఆమె ఆదేశించారు. దీంతో కేసీఆర్ ఆ నిధులు విడుదల చేస్తారా? గవర్నర్ తో ఢీ కొంటారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఆ పథకం కింద తొలుత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తేనే కేంద్రప్రభుత్వం తన వాటాను ఇస్తుంది. ఇది నిబంధన. ఆగ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతాయి.

కనీసం అక్టోబర్ లో నైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తేనే 2020 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన నిధులను విడుదల చేస్తుంది. లేదంటే ఆ నిధులు మురిగిపోతాయి. ఈ ప్రాజెక్టు కింద ప్రత్యేకమైన ప్యాకల్టీనీ రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది.

First Published:  19 Oct 2019 3:05 AM GMT
Next Story