Telugu Global
NEWS

ఇప్పటికీ కొనసాగుతున్న హర్షవర్ధన్ చౌదరి హవా

విశాఖ ఎయిర్‌పోర్టులో గతేడాది ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరగడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తుల్లో హర్షవర్ధన్ చౌదరి కూడా ఒకరు. ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహిస్తున్న హర్షవర్ధన్‌ చౌదరి వద్దే జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ పనిచేసేవాడు. జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. అందుకు అనువైన పరిస్థితులను హర్షవర్ధన్ చౌదరి కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. బయటి నుంచి జగన్‌మోహన్ రెడ్డికి కాఫీ కూడా తేకుండా ఎయిర్‌పోర్టు […]

ఇప్పటికీ కొనసాగుతున్న హర్షవర్ధన్ చౌదరి హవా
X

విశాఖ ఎయిర్‌పోర్టులో గతేడాది ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరగడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తుల్లో హర్షవర్ధన్ చౌదరి కూడా ఒకరు.

ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహిస్తున్న హర్షవర్ధన్‌ చౌదరి వద్దే జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ పనిచేసేవాడు. జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. అందుకు అనువైన పరిస్థితులను హర్షవర్ధన్ చౌదరి కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. బయటి నుంచి జగన్‌మోహన్ రెడ్డికి కాఫీ కూడా తేకుండా ఎయిర్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చింది హర్షవర్ధన్‌ చౌదరే.

అలా బయటి నుంచి కాఫీ తెచ్చే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్‌లోనే కాఫీ ఆర్డర్ ఇచ్చారు. కాఫీ ఇచ్చే సాకుతో వచ్చిన శ్రీనివాస్‌… జగన్‌పై కత్తితో దాడి చేశారు.

హర్షవర్ధన్‌ చౌదరిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా సరే ఆయనే ఇప్పటికీ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అంతేకాదు అక్టోబర్‌ 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ వచ్చిన సమయంలో హర్షవర్ధన్ చౌదరి తన హవా మరోసారి చెలాయించాడు.

పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వెళ్లేందుకు 11 రాత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు రాగా… హర్షవర్ధన్‌ చౌదరి భారీగా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా వీఐపీ లాంజ్‌లోకి ముందస్తు అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. కానీ చంద్రబాబు వచ్చిన సమయంలో దాదాపు వంద మంది నేతలు, కార్యకర్తలు కూడా లాంజ్‌లోకి వచ్చేశారు. కానీ ఒక్క అధికారి కూడా వారికి అడ్డుచెప్పలేదు.

అలా వీఐపీ లాంజ్‌లోకి చొచ్చుకొచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు హర్షవర్ధన్ చౌదరి రాచమర్యాదలు చేశాడు. బయటి నుంచి చికెన్ బిర్యానీ తెప్పించి పంచిపెట్టాడు.

జగన్‌కు కాఫీ కూడా బయట నుంచి రాకుండా అడ్డుకున్న హర్షవర్ధన్‌ చౌదరి… టీడీపీ కార్యకర్తలకు మాత్రం బిర్యానీ తెప్పించి వీఐపీ లాంజ్‌లోనే వడ్డించాడు. ఆ సమయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన మిగిలిన ప్రయాణికులు ఇబ్బందిపడ్డా… భద్రతా సిబ్బంది అడ్డు చెప్పలేదు. ఇలా దాదాపు గంట పాటు ఎయిర్‌పోర్టులో టీడీపీ కార్యకర్తలు, హర్షవర్ధన్ చౌదరి హల్ చల్ చేశారు.

ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లోకి ఇలా భారీగా కార్యకర్తలు రావడం, లాంజ్‌లోనే బిర్యానీలు తిని వాతావరణాన్ని పాడు చేయడంపై ఎయిర్‌ పోర్టు ఉన్నతాధికారి రాజా కిషోర్ విచారణకు ఆదేశించారు. అంత మంది హఠాత్తుగా వీఐపీ లాంజ్‌లోకి వచ్చినా ఎందుకు అడ్డుకోలేదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  19 Oct 2019 3:09 AM GMT
Next Story