జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం… ఫొటో వైరల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పట్ల జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మరోసారి సానుకూలత ప్రదర్శించారు. ఆ మధ్య అసెంబ్లీలో జగన్‌ను ఆశాకానికెత్తిన రాపాక… తాజాగా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది.

వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందించింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్‌ … జగన్‌కు కృతజ్ఞత తెలుపుతూ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ హాజరయ్యారు. ఆయనతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక హాజరయ్యారు. అంతటితో ఆగకుండా ఆటో డ్రైవర్లతో కలిసి జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్ పనితీరును ప్రశంసించారు.