రాజుగారి గది-3కి కోటి షేర్

అన్నీతానై ఓంకార్ తీసిన రాజుగారి గది 3 సినిమాకు మొదటి రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ కంటే కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో… బి, సి సెంటర్లలో మూవీ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక షేర్ విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రాజుగారి గది 2 ఓపెనింగ్ షేర్ కంటే ఇది తక్కువే. రాజుగారి గది 2 లో సమంత, నాగార్జున లాంటి స్టార్ కాస్ట్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

ప్రస్తుతానికైతే రాజుగారి గది 3 సినిమాకు మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బి, సి సెంటర్లలో మాత్రం జనాలు ఈ సినిమా కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సెంటర్లలో సినిమా క్లిక్ అయితే, రాజుగారి గది 3 సినిమా హిట్ అయినట్టే.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్

నైజాం – రూ. 42 లక్షలు
సీడెడ్ – రూ. 24 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 16 లక్షలు
ఈస్ట్ – రూ. 10 లక్షలు
వెస్ట్ – రూ. 6 లక్షలు
గుంటూరు – రూ. 14 లక్షలు
నెల్లూరు – రూ. 4 లక్షలు
కృష్ణా – రూ. 9 లక్షలు