Telugu Global
NEWS

టమోటా రైతుల ఆందోళనపై స్పందించిన జగన్

కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా రైతుల సమస్య పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తక్షణం రైతులకు అండగా రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు టమోటా ధరను ఏకంగా 50 పైసలకు పడేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. వందల కిలోల టమోటాను రోడ్డుపై పారబోశారు. దీంతో జగన్ స్పందించారు. అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా టమోటాను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని ఆదేశించారు. దాంతో ఆ దిశగా టమోటా […]

టమోటా రైతుల ఆందోళనపై స్పందించిన జగన్
X

కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా రైతుల సమస్య పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తక్షణం రైతులకు అండగా రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు టమోటా ధరను ఏకంగా 50 పైసలకు పడేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. వందల కిలోల టమోటాను రోడ్డుపై పారబోశారు. దీంతో జగన్ స్పందించారు. అధికారులతో మాట్లాడారు.

ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా టమోటాను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని ఆదేశించారు. దాంతో ఆ దిశగా టమోటా కొనుగోళ్లను అధికారులు చేపట్టారు. ప్రభుత్వం సీరియస్ కావడంతో మార్కెట్‌లోకి వచ్చి ప్రైవేట్ వ్యాపారులు కూడా టమోటా కొంటున్నారు.

గతంలో ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్‌ లోపలే టమోటాను కొనుగోలు చేసేవారు. ఇందుకు రైతుల నుంచి నాలుగు శాతం కమిషన్ ప్రైవేట్ వ్యాపారులు తీసుకునే వారు. రైతులకు మరింత మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మార్కెట్‌లో రైతుల నుంచి వ్యాపారులు కమిషన్ వసూలు చేయకుండా నిషేధం విధించింది. దాంతో మార్కెట్‌లో కొంటే కమిషన్‌ రాదన్న ఉద్దేశంతో మార్కెట్ బయట ప్రైవేట్ స్థలంలో టమోటా కొనుగోళ్లను మొదలుపెట్టారు.

మార్కెట్‌ లోపలికి తాము రాబోమని… ప్రైవేట్ స్థలంలోనే కొంటామని రైతులకు వ్యాపారులు స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలంలో కొనుగోళ్లు మొదలుపెట్టిన వ్యాపారులు ఇక్కడ ఏకంగా రైతుల నుంచి 10 శాతం కమిషన్ వసూలు చేస్తున్నారు. ఇది రైతుల ఆగ్రహానికి దారి తీసింది.

First Published:  19 Oct 2019 5:23 AM GMT
Next Story