జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రకటించింది. వీరు ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును సమీక్షిస్తారు.

 • శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా కొడాలి నాని
 • విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్‌
 • విశాఖ జిల్లా – కన్నబాబు
 • తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ
 • పశ్చిమ గోదావరి జిల్లా- పేర్నినాని
 • కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 • గుంటూరు జిల్లా – రంగనాథ రాజు
 • ప్రకాశం జిల్లా- బుగ్గన రాజేంద్రనాథ్‌
 • నెల్లూరు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
 • కర్నూలు జిల్లా- అనిల్ కుమార్ యాదవ్
 • కడప జిల్లా- ఆదిమూలపు సురేష్
 • అనంతపురం జిల్లా- బొత్స సత్యనారాయణ
 • చిత్తూరు జిల్లా- మేకపాటి గౌతమ్ రెడ్డిలను ఇన్‌చార్జ్‌ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.