Telugu Global
NEWS

సున్నా మార్కులకు ఉద్యోగాలపై కలెక్టర్ వివరణ

సున్నా మార్కులు వచ్చినా ఎస్సీ, ఎస్టీలు గ్రామ సచివాలయ ఉద్యోగానికి అర్హులు అని ఇటీవల కడప కలెక్టర్ హరికిరణ్ ప్రకటించడం చర్చనీయాంశం అయింది. సున్నా మార్కులు వచ్చిన వారికి జాబ్ ఇవ్వడం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. దీంతో కలెక్టర్ వివరణ ఇచ్చారు. సున్నా మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం దక్కదని చెప్పారు. కనీస అర్హతగా ఓసి లకు 60, బీసీలకు 52.5, ఎస్సీలకు 45 మార్కులను నిర్ణయించామన్నారు. 45మార్కులు కంటే ఎక్కువ వచ్చిన […]

సున్నా మార్కులకు ఉద్యోగాలపై కలెక్టర్ వివరణ
X

సున్నా మార్కులు వచ్చినా ఎస్సీ, ఎస్టీలు గ్రామ సచివాలయ ఉద్యోగానికి అర్హులు అని ఇటీవల కడప కలెక్టర్ హరికిరణ్ ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

సున్నా మార్కులు వచ్చిన వారికి జాబ్ ఇవ్వడం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. దీంతో కలెక్టర్ వివరణ ఇచ్చారు. సున్నా మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం దక్కదని చెప్పారు.

కనీస అర్హతగా ఓసి లకు 60, బీసీలకు 52.5, ఎస్సీలకు 45 మార్కులను నిర్ణయించామన్నారు. 45మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వారితో పోస్ట్ లు భర్తీ కాకపోతే అప్పుడు కనీస అర్హత మార్కుల కంటే కిందకు వెళ్లి అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరుగుతుంది అని చెప్పారు.

సున్నా మార్కులతో ఉద్యోగం దక్కే అవకాశం లేదని వివరణ ఇచ్చారు కలెక్టర్.

First Published:  20 Oct 2019 1:41 AM GMT
Next Story