ఈ టైమ్ లో రకుల్ బ్రేక్ తీసుకుంటుంది !

రకుల్ అంటే ఒకప్పుడు క్రేజ్. కానీ ఇప్పుడు పాపులారిటీ మొత్తం పోయింది. అవకాశాలైతే వరుసగా వస్తున్నాయి కానీ సక్సెస్ లు మాత్రం ఆమెను పలకరించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలని భావిస్తోంది ఈ మెరుపుతీగ. వరుసగా ఫ్లాపులొస్తున్నప్పుడు హీరోలు గ్యాప్ తీసుకోవడం సహజం. మరి హీరోయిన్ గ్యాప్ తీసుకుంటే ఏమౌతుంది.

హీరోలు గ్యాప్ తీసుకున్నా మళ్లీ మరో మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతారు. కానీ గ్యాప్ తీసుకున్న హీరోయిన్లు మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన సందర్భాల్లేవు. అట్నుంచి అటు ఇంటికే. లేకపోతే క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అవ్వడమే. హీరోయిన్ల కెరీర్ స్పాన్ అలాంటిది. ఇవన్నీ తెలిసి కూడా గ్యాప్ తీసుకుంటానని రకుల్ ప్రకటించడం నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.

రీసెంట్ గా ఆమె హిందీలో చేసిన దే దే ప్యార్ దే సినిమా హిట్ అయింది. అలాఅని ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టలేదు. పోనీ తెలుగులో ఏమైనా పరిస్థితి బాగుందా అంటే అది కూడా లేదు. తాజాగా చేసిన మన్మథుడు-2 సినిమా డిజాస్టర్ అయింది. అటు తమిళ్ లో కూడా రకుల్ కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో వచ్చిన సినిమాలకు ఒప్పుకుంటూ క్యాష్ చేసుకోవాలి తప్పితే, గ్యాప్ తీసుకోవాలని అనుకోవడం మంచి నిర్ణయం కాదని అంటున్నారు సినిమా పండితులు. రకుల్ కు ఈ విషయంలో సలహా ఇచ్చేది ఎవరో?