బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆది

టీడీపీలోని సీనియర్, కీలక నేతల వలసలు కొనసాగుతున్నాయి. మొన్నీ మధ్యే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. అది మరవక ముందే ముఖ్యమైన కీలక నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయలసీమకు చెందిన సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి షాక్ ఇచ్చాడు. సోమవారం ఉదయం బీజేపీలో చేరిపోయాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నాడు.

ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అనంతరం టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవిని దక్కించుకున్నాడు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించాడు.

అయితే వైసీపీకి హ్యాండిచ్చిన ఆదికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. మంత్రి పదవి ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును ఇచ్చాడు. కానీ ఆది ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తాజాగా బీజేపీలో చేరిపోయాడు ఆది. ఇదివరకే చేరాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రద్దు అయ్యింది.