Telugu Global
Cinema & Entertainment

హరీష్ రావు చూసే తాజా చిత్రం ఇదేనట...

మంత్రి హరీష్ రావు.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన ఈయన సినిమాలు చూసేదే తక్కువ. అలాంటి హరీష్ రావు తాజాగా ఓ సినిమా వేడుకకు వచ్చారు. నిర్మాతగా మారి సినిమా తీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను, హీరోగా మారిన బిత్తిరి సత్తిని ప్రశంసించాడు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్టాడుతూ… ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా మారి సాహసం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఓ సినిమా విషయంలో నాకు బాగా నచ్చిందేమిటంటే ప్రోడ్యూసర్ […]

హరీష్ రావు చూసే తాజా చిత్రం ఇదేనట...
X

మంత్రి హరీష్ రావు.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన ఈయన సినిమాలు చూసేదే తక్కువ. అలాంటి హరీష్ రావు తాజాగా ఓ సినిమా వేడుకకు వచ్చారు. నిర్మాతగా మారి సినిమా తీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను, హీరోగా మారిన బిత్తిరి సత్తిని ప్రశంసించాడు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్టాడుతూ… ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా మారి సాహసం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఓ సినిమా విషయంలో నాకు బాగా నచ్చిందేమిటంటే ప్రోడ్యూసర్ ఉద్యమ కారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. దర్శకుడు టీ ప్రభాకర్ తెలంగాణవాది. హీరో బిత్తిరిసత్తి తెలంగాణ ప్రాంతపు వ్యక్తి. హీరోయిన్ ప్రియ తెలంగాణకు చెందిన కళాకారిణి. ఇలా తెలంగాణ వారితోనే సినిమా తీయడం చాలా ఆనందం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంతో తెరకెక్కిన ‘తుపాకి రాముడు’ చిత్రం కోసం ఎక్కడికీ వెళ్ళలేదు. తెలంగాణ పల్లెల్ని లోకేషన్లుగా ఎంచుకొని సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ చెరువుగట్టు మీద తీశారు. బతుకమ్మ పండగను గొప్పగా చూపించారు. అద్బుతమైన సందేశాన్ని టీ ప్రభాకర్, నిర్మాత రసమయి ఈ సినిమా ద్వారా అందించారు… అని మంత్రి హరిష్ రావు పేర్కోన్నారు.

యాంకర్ గా మొదలై కామెడీ టైమింగ్ తో బుల్లితెరపై ఫేమస్ అయిన బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకి రాముడు’ సినిమా రిలీజ్ కు సిద్దమైంది. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదేవ రవి, జోషి లాంటి స్ధానిక కళాకారులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలిజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో పలువురు రాజకీయ నాయకుల నేతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ , శ్రీనివాసయాదవ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.తాను సినిమాలు తక్కువగా చూస్తానని.. ఈ సినిమాను మాత్రం ఖచ్చితంగా చూస్తానని హరీష్ రావు పేర్కొనడం గమనార్హం.

First Published:  21 Oct 2019 3:43 AM GMT
Next Story