మహేష్ ఖాళీగా ఉన్నాడు… డైరెక్టర్లు బిజీగా ఉన్నారు

ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ఎనౌన్స్ చేయడం మహేష్ స్టయిల్. చేస్తున్న సినిమా కొలిక్కి వస్తున్న టైమ్ లోనే కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిపోతాడు. కానీ ఈసారి దీనికి భిన్నంగా వ్యవహరించబోతున్నాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించలేదు. దీనికి ఓ కారణం ఉంది.

లెక్కప్రకారం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయాలి. కానీ కథ ఎంతకీ తెగలేదు. దీంతో సందీప్ మరోసారి బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆ కథ కూడా ప్రస్తుతానికి రెడీగా లేదు. మరింత టైమ్ కావాలని వంశీ కోరాడట. దీనికితోడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మహేష్ కు కథ చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ దర్శకుడు కూడా కేజీఎఫ్2తో బిజీగా ఉన్నాడు.

సో.. అందుబాటులో ఉన్న దర్శకులంతా టైమ్ కోరడంతో మహేష్ కూడా గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత దాదాపు 4 నెలలు మహేష్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరు ముందుగా బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే, వాళ్లకు అవకాశం ఇస్తాడు సూపర్ స్టార్.