మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డిని అరెస్ట్ చేసిన హైదరాబాద్‌ పోలీసులు

కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డి అరెస్ట్ అయ్యారు. తిక్కారెడ్డిని ఎమ్మిగనూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారంటూ వ్యాపార భాగస్వామి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న మద్యం పరిశ్రమకు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదన్నది ఆరోపణ. 12 కోట్ల రూపాయలను తిక్కారెడ్డి చెల్లించాల్సి ఉందని వ్యాపార భాగస్వామి ఫిర్యాదు చేశాడు.