Telugu Global
NEWS

వెలుగులోకి నవయుగ మరో భారీ కుంభకోణం...

రామోజీ రావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు అండతో ఆ కంపెనీ చెలరేగిపోయిన విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు అంటూ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూములు తీసుకున్న నవయుగ సంస్థ ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా 19వందల కోట్ల రూపాయలు రుణం పొందింది. ఇలా ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టే సమయంలో ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం కూడా […]

వెలుగులోకి నవయుగ మరో భారీ కుంభకోణం...
X

రామోజీ రావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు అండతో ఆ కంపెనీ చెలరేగిపోయిన విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటు అంటూ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే భూములు తీసుకున్న నవయుగ సంస్థ ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా 19వందల కోట్ల రూపాయలు రుణం పొందింది. ఇలా ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టే సమయంలో ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం కూడా తీసుకోకుండానే పనికానిచ్చింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామంటూ 2009, 2010లో నవయుగ సంస్థ 4వేల 731 ఎకరాల భూమిని తీసుకుంది. పదేళ్లు దాటినా ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు. ఆ భూమిని తాకట్టు పెట్టి ఐసీఐసీఐ నుంచి 400కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి 250 కోట్లు, అలహాబాద్ బ్యాంకు నుంచి 200 కోట్లు రుణం తీసుకుంది. మరికొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది.

4వేల 731 ఎకరాలు తీసుకుని ఒక్క పని మొదలుపెట్టని నవయుగ కంపెనీ తిరిగి మరో 6వేల ఎకరాల భూమి తమకు కావాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టింది. ఇటీవల ఏపీఐఐసీ జరిపిన దర్యాప్తులో ఈ విషయాన్నీ వెలుగులోకి వచ్చాయి.

ఇక్కడ నవయుగ మరో మాయ కూడా ఉంది. ఈ 4వేల 731 ఎకరాల భూమిని కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున కేటాయించారు. కానీ వివిధ బ్యాంకుల్లో ఈ భూమిని నవయుగ గ్రూపుకు చెందిన ఇతర కంపెనీల పేరుతో తాకట్టు పెట్టి వందల కోట్ల రుణం తీసుకుంది. ఇదెలా సాధ్యమైంది? బ్యాంకులు ఇంత గుడ్డిగా ఎలా వందల కోట్ల రుణం ఇచ్చాయి అన్నది అంతుపట్టడం లేదు.

బడాబాబులకు బ్యాంకులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటాయనడానికి మరో నిదర్శనం. ఇలా ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిపై రుణం ఇవ్వాలంటే ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం తేవాలి. కానీ అది లేకుండానే బ్యాంకులు వందల కోట్లు సమర్పించుకున్నాయి. ఒక్క ఐఎఫ్‌సీఐ మాత్రమే ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం తేవాల్సిందిగా తేల్చింది. అందుకు ఏపీఐఐసీ అంగీకరించకపోవడంతో 250 కోట్ల లోన్ అందుకోలేకపోయింది.

ఇండ్రస్ట్రియల్ పార్కు కోసం తీసుకున్న రుణాలతో అక్కడ ఎలాంటి పనులు చేయకుండా ఆ నిధులన్నింటినీ ఇతర అవసరాలకు వాడేసుకుంది. గత ప్రభుత్వంలోనే నవయుగ లీలలను అధికారులు గుర్తించారు. దాంతో భూములను రద్దు చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు. రెండుసార్లు ఫైల్‌ ముందుకు వెళ్లకుండా వెనక్కు పంపించారు.

ఈ వ్యవహారం బట్టి చూస్తుంటే ప్రభుత్వం నుంచి నవయుగ సంస్థ 4వేల 731ఎకరాలు తీసుకున్నది పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కాదు… కేవలం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకోవడానికే అని అధికారులు చెబుతున్నారు. లోన్ తీసుకుని కట్టకుండా ఎగ్గొడితే మహా అయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని జప్తు చేసుకుంటారు అన్నది ఈ కంపెనీ ఉద్దేశంగా భావిస్తున్నారు. కానీ ఏపీఐఐసీ నుంచి నిరభ్యంతర పత్రం లేకుండానే బ్యాంకులు ఈ కంపెనీకి వందల కోట్లు ఎలా రుణాలు ఇచ్చాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

First Published:  20 Oct 2019 7:52 PM GMT
Next Story