స్పానిష్ బుల్ వెడ్డింగ్ బెల్స్

  • 14 ఏళ్ల ప్రేమను పెళ్లిగా మార్చుకొన్న నడాల్

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన బాల్యస్నేహితురాలు మారియా ఫ్రాన్సిస్కా పెరెలీతో 14 సంవత్సరాల తన ప్రేమబంధాన్ని.. వివాహబంధంగా మార్చుకొన్నాడు.

తన కెరియర్ లో ఇప్పటికే 19 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్లేకోర్టు కింగ్ నడాల్..33 ఏళ్ల వయసులో పెళ్లికొడుకయ్యాడు. 31 సంవత్సరాల తన స్నేహితురాలు పెరెలీని తన జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు.

గత 14 సంవత్సరాలుగా పెరెలీతో సహజీవనం చేస్తూ వచ్చిన నడాల్…మొలార్కాలోని ఓ రాజభవంతిలో..350 మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకొన్నాడు.

రఫా వివాహానికి హాజరైన విశిష్ట అతిథుల్లో స్పెయిన్ మాజీ రాజు జువాన్ కార్లోస్ సైతం ఉన్నారు.