రికార్డు మ్యాచ్ కు ఫెదరర్ రెడీ

  • 1500 మ్యాచ్ ల ఒకే ఒక్కడు ఫెదరర్

గ్రాండ్ స్లామ్ కింగ్, స్విస్ కూల్ కూల్ స్టార్ రోజర్ ఫెదరర్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నాడు. తన సుదీర్ఘ కెరియర్ లో 1500వ సింగిల్స్ పోరుకు సిద్ధమయ్యాడు.

38 సంవత్సరాల రోజర్ ఫెదరర్ కు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా…మొత్తం 102 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు ఉంది.

బాసెల్ టూర్ టోర్నీని ఇప్పటికే తొమ్మిదిసార్లు నెగ్గిన ఫెదరర్ పదోసారి టైటిల్ కు గురిపెట్టాడు. తొలిరౌండ్లో జర్మన్ క్వాలిఫైయర్ పీటర్ గోజోవిక్ తో తలపడనున్నాడు.

ఇప్పటికే సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించిన ఫెదరర్…2019 సీజన్లో 47 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో నిలిచాడు.

కొత్తపెళ్లికొడుకు రాఫెల్ నడాల్ కు శుభాకాంక్షలు తెలిపాడు. రఫా నుంచి తనకు ఆహ్వానం అందలేదని… అతను ఆహ్వానిస్తాడని తాను ఆశించలేదని కూడా ఫెదరర్ తెలిపాడు.