Telugu Global
NEWS

మళ్లీ చంద్రబాబే కావాలనుకుంటున్నారట....

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని.. మళ్లీ తానే సీఎం కావాలని వారు కోరుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసి ఐదారు నెలలు కాకముందే…. జగన్ పాలనను కనీసం ఆరు నెలలు కూడా చూడక ముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ అభిప్రాయానికి వచ్చేయడం విస్మయం కలిగిస్తోందని టీడీపీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రతి 5 […]

మళ్లీ చంద్రబాబే కావాలనుకుంటున్నారట....
X

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని.. మళ్లీ తానే సీఎం కావాలని వారు కోరుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసి ఐదారు నెలలు కాకముందే…. జగన్ పాలనను కనీసం ఆరు నెలలు కూడా చూడక ముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ అభిప్రాయానికి వచ్చేయడం విస్మయం కలిగిస్తోందని టీడీపీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి.

ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల సంగ్రామంలో ప్రజలు ఓ పార్టీని, ఆ పార్టీని నడిపించే వ్యక్తిని, ఆయన ఇచ్చిన హామీలను నమ్మి ఓటేస్తారు. అంటే వచ్చే ఐదేళ్లు పాలించమని అధికారమిస్తారు. కానీ చంద్రబాబు మూడు నెలలకే మొదలు పెట్టడం విస్మయం కలిగిస్తోంది.

టీడీపీలోని సీనియర్లు, కొందరు కాపు నేతలు కూడా మొన్నీ మధ్య అదే అభిప్రాయం వెలుబుచ్చారు. తన బినామీలుగా పేరుబడ్డ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి తనకు అత్యంత ముఖ్యులను బీజేపీలోకి చంద్రబాబే పంపి…. టీడీపీని బలోపేతం చేస్తామంటూ, అధికారంలోకి వచ్చేస్తామంటూ చెప్పడం జనాలను మోసం చేయడమేనని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

అఖండ ప్రజల మద్దతుతో గద్దెనెక్కిన జగన్ ను, ప్రజా తీర్పును అవమానించేలా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు రాజకీయాల్లో ఆయన పరువును దిగజార్చుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

First Published:  21 Oct 2019 11:31 PM GMT
Next Story