డిస్కోరాజా మూవీ అప్ డేట్స్

డిస్కోరాజాకు సంబంధించి మరో భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు రవితేజ. ఐస్ ల్యాండ్ లో ఈ సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఐస్ లాండ్ లోని రెండో అతిపెద్ద ద్వీపంలో ఈ షెడ్యూల్ జరిగింది. తాజా షూట్ తో డిస్కోరాజాకు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. 2 పాటల్ని హైదరాబాద్ లోనే షూట్ చేయబోతున్నారు. మరో పాట కోసం మరోసారి విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తోంది డిస్కోరాజా మూవీ. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రికొడుకుల పాత్రల్లో రవితేజ కనిపించబోతున్నాడు. వీటిలో ఒక పాత్ర కాస్త నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందని టాక్. రవితేజ సరసన తన్యా హోప్, పాయల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. కానీ క్రిస్మస్ రేస్ నుంచి డిస్కోరాజా తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.