Telugu Global
NEWS

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భారత్ టాప్

రాంచీ టెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగుల విజయం మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రోహిత్ శర్మ ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో…ప్రపంచ నంబర్ వన్ భారత్…ఐదుకు ఐదు టెస్టులూ, వరుసగా రెండు సిరీస్ లూ నెగ్గడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో సౌతాఫ్రికాను ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా.. భారత్ సిరీస్ స్వీప్ […]

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భారత్ టాప్
X
  • రాంచీ టెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగుల విజయం
  • మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రోహిత్ శర్మ

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో…ప్రపంచ నంబర్ వన్ భారత్…ఐదుకు ఐదు టెస్టులూ, వరుసగా రెండు సిరీస్ లూ నెగ్గడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో సౌతాఫ్రికాను ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా.. భారత్ సిరీస్ స్వీప్ తో విజేతగా నిలిచింది.

ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజుఆట కొనసాగించిన సౌతాఫ్రికా ఆఖరి రెండు వికెట్లను అరంగేట్రం స్పిన్నర్ షాబాజ్ నదీమ్ పడగొట్టి…విజయాన్ని పూర్తి చేశాడు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టెస్ట్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

భారత్ పాంచ్ పటాకా…

టెస్ట్ లీగ్ ప్రారంభ సిరీస్ లో వెస్టిండీస్ ను 2-0తో చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసిన భారత్…సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో సైతం క్లీన్ స్వీప్ విజయంతో …మొత్తం 240 పాయింట్లతో …తొమ్మిదిజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ తలపడనుంది.

టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ సారథిగా భారత్ కు ఇది 31వ గెలుపు మాత్రమే కాదు…స్వదేశీ గడ్డపై వరుసగా 11వ సిరీస్ విజయం కూడా. అంతేకాదు… ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న పది వరుస సిరీస్ విజయాల ప్రపంచ రికార్డును భారత్ 11వ సిరీస్ విజయంతో తెరమరుగు చేసి… సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

టాప్ ర్యాంకర్ భారత్ కు …3వ ర్యాంకర్ సౌతాఫ్రికా ఏమాత్రం సరిజోడీ కాదని ప్రస్తుత సిరీస్ ద్వారా తేలిపోయింది.

First Published:  22 Oct 2019 4:53 AM GMT
Next Story