Telugu Global
National

కచ్చులూరులో మునిగిన బోటును బయటకు తీసిన సత్యం బ్యాచ్

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు ఎంతటి పెను విషాదాన్ని తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఈ బోటులో 70 మందికి పైగా ప్రయాణించడం.. కేవలం 30 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టారు. ఇంకా కొన్ని మృతదేహాల జాడ కూడా దొరకలేదు.. ఈ బోటును వెలికితీయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ కు ఈ ఆపరేషన్ బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. తాజాగా ఈ బోటు […]

కచ్చులూరులో మునిగిన బోటును బయటకు తీసిన సత్యం బ్యాచ్
X

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు ఎంతటి పెను విషాదాన్ని తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఈ బోటులో 70 మందికి పైగా ప్రయాణించడం.. కేవలం 30 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టారు. ఇంకా కొన్ని మృతదేహాల జాడ కూడా దొరకలేదు..

ఈ బోటును వెలికితీయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ కు ఈ ఆపరేషన్ బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.

తాజాగా ఈ బోటు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దాదాపు 50 అడుగుల లోతున గోదావరి నదిలో ఇసుకలో కూరుకుపోయిన బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. మరికాసేపట్లో బోటును ధర్మాడి సత్యం టీం ఒడ్డుకు తీసుకురానున్నది.

అయితే ఈ మునిగిన రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. లంగర్ వేయడంతో పార్ట్ లు పార్ట్ లుగా ఇది బయటకు వచ్చింది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బోటులో ఉన్న మృతదేహాల కోసం వెతుకుతున్నారు.

First Published:  22 Oct 2019 4:37 AM GMT
Next Story