ఒకే ఏడాది ఈ హీరో నుంచి 3 సినిమాలు

ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. శ్రీనివాసకళ్యాణం తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ మొత్తాన్ని ఒకేసారి భర్తీచేయబోతున్నాడు నితిన్. వచ్చే ఏడాది ఏకంగా 3 సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నాడు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రికి విడుదల చేయబోతున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవ్వాలి. వచ్చే ఏడాదికి వాయిదాపడింది.

ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాను రీసెంట్ గా లాంచ్ చేశాడు నితిన్. దీనికి రంగ్ దే అనే టైటిల్ పెట్టారు. కీర్తిసురేష్ హీరోయిన్, దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇది కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పైనే వస్తోంది. దీన్ని వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో విడుదల చేయాలనేది టార్గెట్.

ఈ రెండు సినిమాలతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మలి అర్థభాగంలో విడుదల చేయబోతున్నారు. ఇలా నితిన్ నుంచి వచ్చే ఏడాది ఏకంగా 3 సినిమాలు రాబోతున్నాయి.