Telugu Global
NEWS

అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ విరాట్

51 టెస్టుల్లో 31 విజయాలతో కొహ్లీ టాప్ టెస్టు క్రికెట్లో భారత్ కు అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు. జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించడం ద్వారా కొహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. సఫారీలపై క్లీన్ స్వీప్.. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ 3-0తో క్లీన్ […]

అత్యధిక టెస్ట్ విజయాల కెప్టెన్ విరాట్
X
  • 51 టెస్టుల్లో 31 విజయాలతో కొహ్లీ టాప్

టెస్టు క్రికెట్లో భారత్ కు అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు. జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించడం ద్వారా కొహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

సఫారీలపై క్లీన్ స్వీప్..

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ 3-0తో క్లీన్ స్వీప్ సాధించింది.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టుతో..కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు. రాంచీ టెస్టులో సైతం ఇన్నింగ్స్ విజయంతో భారత్ క్లీన్ స్వీప్ విజయంతో సఫారీలను చిత్తు చేసి…వరుసగా ఐదో టెస్ట్ విజయంతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

సరికొత్త రికార్డు…

సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించి…. గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలిచాడు.

2008 నుంచి 2014 మధ్యకాలంలో భారతజట్టు 60 టెస్టుల్లో ధోనీ నాయకత్వం అందించగా…. 2014 నుంచి ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ వరకూ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

31 విజయాల విరాట్ కొహ్లీ…

టెస్టు క్రికెట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా విరాట్ కొహ్లీ తన రికార్డును తానే మెరుగుపరచుకొన్నాడు. ప్రస్తుత రాంచీ టెస్ట్ వరకూ మొత్తం 51 మ్యాచ్ ల్లో కొహ్లీ 31 విజయాలతో 59కి పైగా విజయశాతం నమోదు చేశాడు.

భారతజట్టుకు 60టెస్టుల్లో నాయకత్వం వహించిన ధోనీ 27 విజయాలు మాత్రమే అందించగలిగాడు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ఆడిన 49 టెస్టుల్లో భారత్ కు 21 విజయాలున్నాయి. ఈ ఇద్దరినీ అధిగమించడం ద్వారా కొహ్లీ 51 టెస్టుల్లో 31 విజయాలు అందించిన భారత ఏకైక కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.

గ్రీమ్ స్మిత్ దే అగ్రస్థానం…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా సౌతాఫ్రికా కు చెందిన గ్రీమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ కెప్టెన్ గా ఆడిన 109 మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా 53 విజయాలు సాధించింది.

ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ రికీ పాంటింగ్ నిలిచాడు. ఆస్ట్ర్రేలియాకు కెప్టెన్ గా పాంటింగ్ 48 టెస్ట్ విజయాలు అందించాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ కు ఇది వరుసగా ఐదో గెలుపు కావడం విశేషం.

వెస్టిండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో నెగ్గిన భారత్…సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని మూడుకు మూడు టెస్టులూ నెగ్గడం ద్వారా రికార్డు స్థాయిలో సిరీస్ కైవసం చేసుకొంది….వరుసగా ఐదో విజయం నమోదు చేయడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

First Published:  22 Oct 2019 4:24 AM GMT
Next Story