Telugu Global
NEWS

మరో ఐదేళ్లకు సరిపడ ఇసుక వచ్చి చేరింది... 15 రోజులు ఆగండి...

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వర్షాలే లేవని దాని వల్ల ఇసుక ఇబ్బందులు రాలేదని… కానీ ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురుస్తుండడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఏడాది కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుకను వెలికితీయడం సాధ్యం కాదన్న విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసని… కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాద్దాంతం చేస్తున్నారని వివరించారు. వరద తగ్గగానే […]

మరో ఐదేళ్లకు సరిపడ ఇసుక వచ్చి చేరింది... 15 రోజులు ఆగండి...
X

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో వర్షాలే లేవని దాని వల్ల ఇసుక ఇబ్బందులు రాలేదని… కానీ ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురుస్తుండడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఏడాది కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుకను వెలికితీయడం సాధ్యం కాదన్న విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసని… కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాద్దాంతం చేస్తున్నారని వివరించారు.

వరద తగ్గగానే ఇసుక కొరత తీరిపోతుందని… 15 రోజుల తర్వాత ఇబ్బందులు ఉండవని… భవిష్యత్తులో ఇసుక కొరత ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని… ఈసారి వరదల కారణంగా 10 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక వచ్చి చేరిందన్నారు. దీని వల్ల మరో ఐదేళ్లకు సరిపడ ఇసుక నదుల్లోకి వచ్చిందన్నారు. కాబట్టి వర్షాలు ఆగిపోగానే కావాల్సినంత ఇసుక దొరుకుతుందన్నారు.

వర్షాకాలంలో భవన కార్మికులకు ఉపాధి లభించకపోవడం అన్న సమస్య తొలి నుంచి ఉందని… వారు కూడా పరిస్థితిని ముందే ఊహించగలరని… కానీ ప్రతిపక్షాలు కొందరు కార్మికులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వరద కారణంగా నదుల్లో ఇసుక తీసే అవకాశం లేకుండాపోయిందని… అందుకే పట్టా భూముల్లో ఇసుకను తీసుకుంటున్నామని వెల్లడించారు.

కొత్త నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకోవాలని… మరో 15 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఐదేళ్ల పాటు నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు యథేచ్చగా దోచుకున్నారని… ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఆదాయం రావడం లేదన్న అక్కసుతోనే టీడీపీ నేతలు ఇసుక అంశాన్ని వివాదం చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

First Published:  22 Oct 2019 7:49 PM GMT
Next Story