Telugu Global
NEWS

మరో ఆల్విన్ కానివ్వను... ఆర్టీసీపై కఠిన వైఖరి తప్పదు

తెలంగాణ ఆర్టీసీని దారిన పెట్టేందుకు కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌… విలీనం డిమాండ్‌పై పట్టుబట్టబోమని కార్మిక సంఘాలే హైకోర్టు ముందు చెప్పాయని… కాబట్టి ఆ డిమాండ్‌పై కాకుండా ఇతర 21 డిమాండ్ల పరిష్కారం కోసం పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఆరుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు సీఎం. రెండు మూడురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. […]

మరో ఆల్విన్ కానివ్వను... ఆర్టీసీపై కఠిన వైఖరి తప్పదు
X

తెలంగాణ ఆర్టీసీని దారిన పెట్టేందుకు కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌… విలీనం డిమాండ్‌పై పట్టుబట్టబోమని కార్మిక సంఘాలే హైకోర్టు ముందు చెప్పాయని… కాబట్టి ఆ డిమాండ్‌పై కాకుండా ఇతర 21 డిమాండ్ల పరిష్కారం కోసం పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఆరుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు సీఎం. రెండు మూడురోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాతే చర్చలపై ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 21 డిమాండ్ల పరిష్కారం సాధ్యమా? కాదా? అన్న దానిపై నివేదిక వచ్చిన తర్వాతే చర్చలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈనెల 28న హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించాలని కేసీఆర్ సూచించారు. ఆర్టీసీని కాపాడుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. యూనియన్లు లేకుంటేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని, ఆర్టీసీ నష్టాలకు కారణం యూనియన్లేనని కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.

ఆల్విన్ కంపెనీ నష్టాలతో లాకౌట్ అయినపుడు ఎవరు మాత్రం ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ మరో ఆల్విన్‌లా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేసీఆర్ అధికారులకు తేల్చి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం సమ్మె విరమించి కార్మికులు వచ్చినా వారిని ఉద్యోగంలోకి తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని కొన్ని యూనియన్లు ముందుకొస్తున్నాయని… కానీ యూనియన్లతో రాజీ పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఆర్టీసీ దివాళా అంచున ఉన్న విషయాన్ని కోర్టుకు వివరించాలని… అప్పుడు హైకోర్టు కూడా కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవచ్చని కేసీఆర్ సూచించారు.

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే అధికారం రాష్ట్రాలదే అంటూ మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చిందని… అదే బీజేపీ నేతలు ఇక్కడ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని మూసేశారని… ఇక్కడ కాంగ్రెస్ మాత్రం ఆర్టీసీ యూనియన్లకు వంతపాడుతోందని కేసీఆర్ విమర్శించారు.

First Published:  23 Oct 2019 1:15 AM GMT
Next Story