Telugu Global
NEWS

గంభీర్, కొహ్లీల సరసన రోహిత్ శర్మ

టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ -10లో హిట్ మాన్ సౌతాఫ్రికా సిరీస్ లో రోహిత్ సూపర్ హిట్ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీల సరసన చోటు సంపాదించాడు. ఐసీసీ వెలువరించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ 10వ స్థానంలో నిలవడం ద్వారా…క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ టాప్-10 ర్యాంకుల్లో చోటు సంపాదించిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. […]

గంభీర్, కొహ్లీల సరసన రోహిత్ శర్మ
X
  • టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ -10లో హిట్ మాన్
  • సౌతాఫ్రికా సిరీస్ లో రోహిత్ సూపర్ హిట్

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీల సరసన చోటు సంపాదించాడు.

ఐసీసీ వెలువరించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ 10వ స్థానంలో నిలవడం ద్వారా…క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ టాప్-10 ర్యాంకుల్లో చోటు సంపాదించిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

529 పరుగులతో రో…హిట్‌…

సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టెస్ట్ సిరీస్ లో…ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ…రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా మొత్తం 529 పరుగులు సాధించడం ద్వారా…ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడమే కాదు..14వ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

సిరీస్ ప్రారంభానికి ముందు టెస్ట్ ర్యాంకింగ్స్ 44వ స్థానంలో మాత్రమే ఉన్న రోహిత్ శర్మ..సిరీస్ ముగిసే సమయానికి 34 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని.. సంచలనం సృష్టించాడు.

2018 ఫిబ్రవరిలో వన్డే క్రికెట్లో రెండో ర్యాంక్, 2018 నవంబర్ లో టీ-20 క్రికెట్లో 7వ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ…2019 అక్టోబర్ లో టెస్ట్ క్రికెట్ 10వ ర్యాంక్ లో నిలవడం ద్వారా…గతంలో ఇదే ఘనత సాధించిన ఢిల్లీ క్రికెటర్లు గౌతం గంభీర్, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 5, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 18 ర్యాంకులు సాధించారు.

మూడుఫార్మాట్లలోనూ కొహ్లీ షో…

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత ఏకైక క్రికెటర్ ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకొంటే.. గౌతం గంభీర్ మాత్రం..మూడుఫార్మాట్లలో 8వ ర్యాంక్ సాధించడం విశేషం.

15వ ర్యాంక్ లో మహ్మద్ షమీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మొత్తం 751 పాయింట్లతో 15వ ర్యాంక్ సాధించాడు. తన కెరియర్ లో అత్యుత్తమంగా.. 2018 మార్చిలో 14వ ర్యాంక్ సాధించిన షమీ దానికంటే ఒక స్థానం దిగువన నిలిచాడు.

మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 624 పాయింట్లతో 24వ ర్యాంక్ లో ఉన్నాడు.

సౌతాఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా…భారత ఆటగాళ్లు ఐదుగురు..టాప్ -20 ర్యాంకింగ్స్ లో నిలవడం విశేషం.

First Published:  23 Oct 2019 8:40 PM GMT
Next Story