Telugu Global
NEWS

ఎస్పీ ఆఫీస్‌లో మహిళ కోసం నాగ్, రుద్రనాగ్‌ ఫైట్.. ఒకరి ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివాహేతర సంబంధం కలకలం రేపింది. ఎస్పీ ఆఫీస్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ కోసం ఇద్దరు ఉద్యోగులు కొట్టుకున్నారు. పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. చివరకు వారిలో రుద్రనాగు అనే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన బాధను వెళ్ళబోసుకుంటూ వీడియో రికార్డు చేసి దాన్ని పోలీసుల ఆఫీషియల్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న […]

ఎస్పీ ఆఫీస్‌లో మహిళ కోసం నాగ్, రుద్రనాగ్‌ ఫైట్.. ఒకరి ఆత్మహత్యాయత్నం
X

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివాహేతర సంబంధం కలకలం రేపింది. ఎస్పీ ఆఫీస్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ కోసం ఇద్దరు ఉద్యోగులు కొట్టుకున్నారు. పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. చివరకు వారిలో రుద్రనాగు అనే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన బాధను వెళ్ళబోసుకుంటూ వీడియో రికార్డు చేసి దాన్ని పోలీసుల ఆఫీషియల్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు.

ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ తొలుత రుద్రనాగుతో సన్నిహితంగా ఉండేది. కొద్ది రోజుల తర్వాత నాగరాజుతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. ఆమె ఇప్పటికీ రుద్రనాగుతోనూ సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్న నాగరాజు… రుద్రనాగు ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. మహిళతో మాట్లాడవద్దంటూ హెచ్చరించాడు.

అదే సమయంలో సదరు మహిళ కూడా రుద్రనాగును దగ్గరకు రానివ్వలేదు. విషయం ఇంట్లో తన భార్యకు తెలియడం, అదే సమయంలో సదరు మహిళ తనను దూరం పెట్టి, నాగరాజుతో తిరగడం చూసి తట్టుకోలేకపోయిన రుద్రనాగు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సెల్‌ టవర్‌ లోకేషన్ ఆధారంగా పోలీసులు సకాలంలో గుర్తించి రుద్రనాగును ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు రికార్డు చేసిన వీడియోలో తనను సదరు మహిళ మోసం చేసిందని రుద్రనాగు ఆరోపించాడు. తొలుత తనతో తిరిగి ఆ తర్వాత నాగరాజుకు ఐ లవ్‌ యూ చెప్పిందని ఆరోపించాడు. తొలుత తనను వాడుకుని ఆ తర్వాత నాగరాజు వద్ద బాగా డబ్బులు ఉన్నాయి… కారు ఉందని గుర్తించి అతడి వైపు మళ్లిందని ఆరోపించాడు. నాగరాజు మంచివాడు కాదు.. కావాలంటే డబ్బులు ఇస్తా వాడిని వదిలేయ్ అని బతిమలాడుకున్నా వినిలేదని రుద్రనాగు వాపోయాడు.

అదే సమయంలో నాగరాజు తన ఇంటికి వచ్చి బెదిరించాడని వివరించారు. దాంతో తాను కొద్దికాలంగా డ్రిఫెషన్‌లో ఉన్నానని.. గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని.. కానీ అప్పుడు చనిపోలేదని.. ఈసారి మాత్రం తప్పకుండా చనిపోతానంటూ వీడియో రికార్డు చేశాడు. కానీ పోలీసులు సకాలంలో గుర్తించడంలో ఈసారి కూడా రుద్రనాగు ఆత్మహత్యాయత్నం ఫలించలేదు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ మొత్తం వ్యవహారం పై స్పందించిన ఎస్పీ ఈ ఇద్దరినీ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

First Published:  25 Oct 2019 2:35 AM GMT
Next Story