Telugu Global
Cinema & Entertainment

సకుటుంబ సపరివార సమేతంగా

మహేష్ అంటే బ్రాండ్.. బ్రాండ్ అంటే మహేష్. టాలీవుడ్ లో మహేష్ అంత ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన స్టార్ మరొకరు లేరు. ఇంకా చెప్పాలంటే బ్రాండింగ్ విషయంలో మహేష్ దరిదాపుల్లోకి కూడా మరో హీరో రాడు. అదీ మహేష్ రేంజ్. ఇప్పుడీ హీరో బ్రాండింగ్ లోకి తన కుటుంబాన్ని కూడా లాగాడు. అవును.. మహేష్, నమ్రత, గౌతమ్, సితార కలిసి ఓ యాడ్ లో నటించేశారు. కొన్ని రోజుల కిందట వీళ్లంతా కలిసి దిగిన ఓ […]

సకుటుంబ సపరివార సమేతంగా
X

మహేష్ అంటే బ్రాండ్.. బ్రాండ్ అంటే మహేష్. టాలీవుడ్ లో మహేష్ అంత ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన స్టార్ మరొకరు లేరు. ఇంకా చెప్పాలంటే బ్రాండింగ్ విషయంలో మహేష్ దరిదాపుల్లోకి కూడా మరో హీరో రాడు. అదీ మహేష్ రేంజ్. ఇప్పుడీ హీరో బ్రాండింగ్ లోకి తన కుటుంబాన్ని కూడా లాగాడు. అవును.. మహేష్, నమ్రత, గౌతమ్, సితార కలిసి ఓ యాడ్ లో నటించేశారు.

కొన్ని రోజుల కిందట వీళ్లంతా కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫొటో ఒకటి నెట్ లో హల్ చల్ చేసింది. అప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇలా ఫ్యామిలీ ఫొటో దిగడం వెనక ఏదో మతలబు ఉందని అంతా అనుకున్నారు. అదే ఇప్పుడు నిజమైంది. ఓ రియల్ ఎస్టేట్ ప్రకటన కోసం వీళ్లంతా ఇలా యాడ్ లో నటించాడు. ఆ ప్రమోషన్ లో భాగంగానే ఇలా గ్రూప్ ఫొటో కూడా దిగారు.

ఇలా సకుటుంబ సపరివార సమేతంగా నటించిన హీరోల్లో బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్ ఉన్నాడు. కొన్ని యాడ్స్ లో అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి కనిపించాడు. సౌత్ లో మాత్రం ఇలా ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్ లో నటించిన ఏకైక హీరోగా నిలిచాడు మహేష్ బాబు. సినిమాల కంటే యాడ్స్ తోనే ఈ హీరో ఎక్కువగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.

First Published:  24 Oct 2019 8:24 PM GMT
Next Story