Telugu Global
NEWS

దత్తత తీసుకోవడం అంటే.... ఇలా కాదేమో !

మహేష్‌ బాబు శ్రీమంతుడు సినిమాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. తన డబ్బును కుమ్మరించి గ్రామాన్ని బాగు చేస్తాడు. మరో సినిమాలో కూడా ఇలాంటి త్యాగమే. తెరమీద పాత్రలను వదిలేసి… నిజ జీవితంలోకి వస్తే… తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌ బాబు దత్తత తీసుకున్నాడు. సినిమాల్లో మహేష్‌ బాబు దానగుణం చూశాక ఇక ఆ ఊరు రూపురేఖలే మారిపోతాయి అనుకున్నారు జనం. స్వతహాగా ధనవంతుడు కావడం, సినిమాల్లో, యాడ్స్‌లో నటించడం ద్వారా ఏడాదికి ఎంతలేదన్నా […]

దత్తత తీసుకోవడం అంటే.... ఇలా కాదేమో !
X

మహేష్‌ బాబు శ్రీమంతుడు సినిమాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. తన డబ్బును కుమ్మరించి గ్రామాన్ని బాగు చేస్తాడు. మరో సినిమాలో కూడా ఇలాంటి త్యాగమే.

తెరమీద పాత్రలను వదిలేసి… నిజ జీవితంలోకి వస్తే… తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌ బాబు దత్తత తీసుకున్నాడు. సినిమాల్లో మహేష్‌ బాబు దానగుణం చూశాక ఇక ఆ ఊరు రూపురేఖలే మారిపోతాయి అనుకున్నారు జనం.

స్వతహాగా ధనవంతుడు కావడం, సినిమాల్లో, యాడ్స్‌లో నటించడం ద్వారా ఏడాదికి ఎంతలేదన్నా 100కోట్లకు పైగానే సంపాదనా పరుడు కావడంతో తను దత్తత తీసుకున్న గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిచేస్తారనుకున్నారు. అలా జరగకపోయేసరికి… కొన్ని విమర్శలు ప్రారంభం అయ్యాయి. దాంతో గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అందుకు కొన్ని సంస్థల సహాయం తీసుకున్నారు. సొంత డబ్బు ఎంత ఖర్చుపెట్టాడో ఎవరికీ తెలియదు.

ఇప్పుడు తను దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ సహాయాన్ని అర్ధించింది మహేష్‌ బాబు భార్య నమ్రత సిరోద్కర్‌. ఈ విషయం బయటకు వచ్చిందో లేదో అప్పుడే నెటిజన్‌ల కామెంట్లు మొదలయ్యాయి. దత్తత తీసుకోవడం అంటే ఇలా కాదేమో అని కొందరు… ప్రభుత్వ డబ్బుతో అంటే ప్రజల డబ్బుతో గ్రామాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు మధ్యలో మీరెందుకు? ప్రభుత్వమే చేయదా? అని కొందరు…. ఇంకా రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి.

నమ్రత ఎలాంటి నమ్మకంతో వచ్చి ఆర్థిక సహాయం అడిగిందో గానీ…. ప్రభుత్వం అందుకు అంగీకరిస్తే మాత్రం ప్రజల నుంచి జగన్‌ ప్రభుత్వానికి విమర్శలు తప్పేలా లేవు.

First Published:  25 Oct 2019 5:09 AM GMT
Next Story