Telugu Global
Cinema & Entertainment

అవార్డు కోసం వెంకీ ప్రయత్నం

ఏ నిమిషానైనా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేస్తాడని అంతా ఎదురుచూశారు. అది మిస్ అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలపైకి వస్తుందని భావించారు. అది కూడా మిస్ అయితే పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో సినిమా సిద్ధంగా ఉందనుకున్నారంతా. కానీ పైన చెప్పుకున్న వాళ్లందరికీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాడు వెంకీ. ఊహించని విధంగా ఓ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ్ లో రీసెంట్ గా వచ్చిన అసురన్ సినిమాను తెలుగులో […]

అవార్డు కోసం వెంకీ ప్రయత్నం
X

ఏ నిమిషానైనా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేస్తాడని అంతా ఎదురుచూశారు. అది మిస్ అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలపైకి వస్తుందని భావించారు. అది కూడా మిస్ అయితే పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో సినిమా సిద్ధంగా ఉందనుకున్నారంతా. కానీ పైన చెప్పుకున్న వాళ్లందరికీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాడు వెంకీ. ఊహించని విధంగా ఓ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తమిళ్ లో రీసెంట్ గా వచ్చిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు వెంకటేష్. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఓ యాక్షన్ డ్రామా. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ మూవీని ఇప్పుడు వెంకీ రీమేక్ చేయబోతున్నాడు. తమిళ ప్రొడ్యూసర్లతో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తాడు.

ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా ఈ సినిమాను వెంకీ అంగీకరించడానికి ఓ కారణం ఉంది. తమిళనాట ఈ సినిమాకు వచ్చిన రివ్యూల్లో అందరూ కామన్ గా ఓ పాయింట్ రాశారు. ఈసారి ధనుష్ కు అవార్డ్ గ్యారెంటీ అనేది ఆ పాయింట్. ఇది వెంకీకి బాగా నచ్చినట్టుంది. అందుకే వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

First Published:  25 Oct 2019 11:42 AM GMT
Next Story